అప్పుడే అహ్మదాబాద్‌లో ఆడతాం: ఐసీసీతో పాక్‌

ప్రపంచకప్‌లో భాగంగా అహ్మదాబాద్‌లో టీమ్‌ఇండియాతో మ్యాచ్‌ ఆడే విషయంలో ఐసీసీకి పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) తమ అభ్యంతరాన్ని తెలియజేసింది.

Published : 08 Jun 2023 02:17 IST

కరాచి: ప్రపంచకప్‌లో భాగంగా అహ్మదాబాద్‌లో టీమ్‌ఇండియాతో మ్యాచ్‌ ఆడే విషయంలో ఐసీసీకి పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) తమ అభ్యంతరాన్ని తెలియజేసింది. ఐసీసీ ఛైర్మన్‌ గ్రెగ్‌ బార్‌క్లే, జనరల్‌ మేనేజర్‌ జెఫ్‌ అలార్డైస్‌ ఇటీవల కరాచీలో పర్యటించినప్పుడు పీసీబీ ఈ విషయాన్ని ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ‘‘ఫైనల్‌ వంటి నాకౌట్‌ మ్యాచ్‌ ఉంటే తప్ప అహ్మదాబాద్‌లో ఆడటం తమకు ఇష్టంలేదని బార్‌క్లే, అలార్డైస్‌కు పీసీబీ ఛైర్మన్‌ నజమ్‌ సేథీ స్పష్టంచేశాడు. భారత్‌లో జరిగే ప్రపంచకప్‌లో పాల్గొనేందుకు పాక్‌ ప్రభుత్వం అనుమతిస్తే తమ మ్యాచ్‌ల్ని చెన్నై, బెంగళూరు, కోల్‌కతాలలో నిర్వహించాలని ఐసీసీని కోరాడు’’ అని పీసీబీ వర్గాలు తెలిపాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని