లంక కొట్టేసింది

అఫ్గానిస్థాన్‌తో మూడు వన్డేల పోరులో తొలి మ్యాచ్‌లో ఓడినప్పటికీ.. ఆ తర్వాత బలంగా పుంజుకున్న శ్రీలంక 2-1తో సిరీస్‌ సొంతం చేసుకుంది. బుధవారం మూడో వన్డేలో లంక 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

Published : 08 Jun 2023 02:17 IST

హంబన్‌టోటా: అఫ్గానిస్థాన్‌తో మూడు వన్డేల పోరులో తొలి మ్యాచ్‌లో ఓడినప్పటికీ.. ఆ తర్వాత బలంగా పుంజుకున్న శ్రీలంక 2-1తో సిరీస్‌ సొంతం చేసుకుంది. బుధవారం మూడో వన్డేలో లంక 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట అఫ్గాన్‌ 22.2 ఓవర్లలో 116కే కుప్పకూలింది. మహమ్మద్‌ నబి (23) టాప్‌స్కోరర్‌. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ చమీర (4/63) ధాటికి ఆ జట్టు బ్యాటింగ్‌ ఆర్డర్‌ కకావికలమైంది. హసరంగ (3/7), లాహిరు (2/29) సత్తా చాటారు. లంక ఒక్క వికెట్‌ మాత్రమే కోల్పోయి 16 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్లు నిశాంక (51), కరుణరత్నె (56 నాటౌట్‌) అర్ధశతకాలతో జట్టును గెలిపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని