వన్డే సిరీస్‌ విండీస్‌ కైవసం

యూఏఈతో మూడు వన్డేల సిరీస్‌ను వెస్టిండీస్‌ మరో మ్యాచ్‌ మిగిలుండగానే కైవసం చేసుకుంది. రెండో వన్డేలో ఆ జట్టు 78 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

Published : 08 Jun 2023 02:17 IST

షార్జా: యూఏఈతో మూడు వన్డేల సిరీస్‌ను వెస్టిండీస్‌ మరో మ్యాచ్‌ మిగిలుండగానే కైవసం చేసుకుంది. రెండో వన్డేలో ఆ జట్టు 78 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట విండీస్‌ 49.5 ఓవర్లలో 306 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్లు బ్రెండన్‌ కింగ్‌ (64; 70 బంతుల్లో 4×4, 4×6), జాన్సన్‌ చార్లెస్‌ (63; 47 బంతుల్లో 8×4, 3×6) అర్ధసెంచరీలతో గట్టి పునాది వేశారు. కార్టీ (32), ఒడియన్‌ స్మిత్‌ (37) రాణించి స్కోరును 300 దాటించారు. ఛేదనలో యూఏఈ 50 ఓవర్లలో 228/7కే పరిమితమైంది. ఆ జట్టు 95కే సగం వికెట్లు కోల్పోయినా.. అలీ నసీర్‌ (57), బాసిల్‌ హమీద్‌ (49) విండీస్‌ విజయాన్ని ఆలస్యం చేశారు. ఛేజ్‌ (2/49), హాడ్జ్‌ (2/46) విండీస్‌ విజయంలో కీలకపాత్ర పోషించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు