హారికకు మళ్లీ డ్రా

కెయిన్స్‌ కప్‌ చెస్‌ టోర్నమెంట్లో భారత గ్రాండ్‌మాస్టర్‌ ద్రోణవల్లి హారికకు మరో డ్రా ఎదురైంది. బుధవారం నాలుగో రౌండ్లో మమద్‌జదా గనయ్‌తో 34 ఎత్తుల్లో డ్రా చేసుకుంది.

Published : 08 Jun 2023 02:17 IST

సెయింట్‌లూయిస్‌: కెయిన్స్‌ కప్‌ చెస్‌ టోర్నమెంట్లో భారత గ్రాండ్‌మాస్టర్‌ ద్రోణవల్లి హారికకు మరో డ్రా ఎదురైంది. బుధవారం నాలుగో రౌండ్లో మమద్‌జదా గనయ్‌తో 34 ఎత్తుల్లో డ్రా చేసుకుంది. మరో తెలుగమ్మాయి కోనేరు హంపికి చుక్కెదురైంది. నానా జాగ్నిడ్జ్‌ (జార్జియా) చేతిలో ఆమె 40 ఎత్తుల్లో పరాజయం చవిచూసింది. దీంతో నాలుగు రౌండ్ల తర్వాత హారిక (2 పాయింట్లు) అయిదు.. హంపి (1) తొమ్మిదో స్థానంలో కొనసాగుతున్నారు. అనా జొటోన్‌స్కీ (అమెరికా, 3) అగ్రస్థానంలో కొనసాగుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు