అశ్విన్‌ కాదు.. శార్దూల్‌

డబ్ల్యూటీసీ ఫైనల్‌కు తుది జట్టును అంచనాలకు తగ్గట్లే ఎంచుకుంది భారత్‌. అశ్విన్‌ ప్రస్తుతం ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో ప్రపంచ నం.1 బౌలర్‌, నం.2 ఆల్‌రౌండర్‌ అయినప్పటికీ..

Published : 08 Jun 2023 02:17 IST

డబ్ల్యూటీసీ ఫైనల్‌కు తుది జట్టును అంచనాలకు తగ్గట్లే ఎంచుకుంది భారత్‌. అశ్విన్‌ ప్రస్తుతం ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో ప్రపంచ నం.1 బౌలర్‌, నం.2 ఆల్‌రౌండర్‌ అయినప్పటికీ.. ఇంగ్లాండ్‌లో అతడి రికార్డు బాగా లేకపోవడం, పిచ్‌పై ఎక్కువ పచ్చిక కనిపించడంతో అతణ్ని పక్కన పెట్టి నాలుగో పేసర్‌గా శార్దూల్‌నే ఎంచుకున్నారు కెప్టెన్‌ రోహిత్‌, కోచ్‌ ద్రవిడ్‌. జడేజా ఏకైక స్పిన్నర్‌గా జట్టులోకి ఎంపికయ్యాడు. మరోవైపు ఇషాన్‌ బ్యాటింగ్‌ బలం కంటే భరత్‌ వికెట్‌ కీపింగ్‌ నైపుణ్యానికే జట్టు యాజమాన్యం ఓటు వేసి అతడికే అవకాశమిచ్చింది. గావస్కర్‌, గంగూలీ సహా పలువురు మాజీలు అశ్విన్‌ను తుది జట్టులోకి తీసుకోవాల్సిందని అభిప్రాయపడ్డారు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని