ఆల్ఫిన్‌కు అర్జున్.. ముంబాకు హంపి, హారిక
గ్లోబల్ చెస్ లీగ్ (జీసీఎల్) ఆరంభ సీజన్‌లో తెలంగాణ యువ సంచలనం అర్జున్ ఇరిగేశిని ఎస్జీ ఆల్ఫిన్ వారియర్స్ సొంతం చేసుకుంది. అయిదు సార్లు ప్రపంచ ఛాంపియన్ మాగ్నస్ కార్ల్‌సన్‌నూ ఈ జట్టే దక్కించుకుంది.
గ్లోబల్ చెస్ లీగ్
బెంగళూరు: గ్లోబల్ చెస్ లీగ్ (జీసీఎల్) ఆరంభ సీజన్‌లో తెలంగాణ యువ సంచలనం అర్జున్ ఇరిగేశిని ఎస్జీ ఆల్ఫిన్ వారియర్స్ సొంతం చేసుకుంది. అయిదు సార్లు ప్రపంచ ఛాంపియన్ మాగ్నస్ కార్ల్‌సన్‌నూ ఈ జట్టే దక్కించుకుంది. మరోవైపు అప్‌గ్రాడ్ ముంబా మాస్టర్స్ తరపున అగ్రశ్రేణి గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, హారిక ద్రోణవల్లి పోటీపడనున్నారు. భారత దిగ్గజ ఆటగాడు విశ్వనాథన్ ఆనంద్.. గాంజెస్ గ్రాండ్‌మాస్టర్స్‌కు ప్రాతినిథ్యం వహించనున్నాడు. తొలి సీజన్ కోసం బుధవారం నిర్వహించిన ప్లేయర్ల డ్రాఫ్ట్‌లో ఆరు జట్లు ఆటగాళ్లను ఎంపిక చేసుకున్నాయి. ఇందులో ప్లేయర్లను.. ఐకాన్, పురుష సూపర్‌స్టార్-1, పురుష సూపర్‌స్టార్-2, మహిళా సూపర్ స్టార్-1, మహిళా సూపర్ స్టార్-2, ప్రాడిజీ అనే ఆరు విభాగాలుగా విభజించి డ్రాఫ్ట్ నిర్వహించారు. ఐకాన్ ఆటగాళ్ల జాబితాలో ఆనంద్, కార్ల్‌సన్‌తో పాటు ప్రపంచ ఛాంపియన్ డింగ్ లిరెన్ ఉన్నారు. ఈ నెల 21 నుంచి జులై 2 వరకు దుబాయ్ చెస్, సాంస్కృతిక క్లబ్‌లో ఈ లీగ్ జరుగుతుంది.
బాలన్ అలక్సన్ నైట్స్: ఇయాన్ నెపోమ్నిషి, తైమర్, నోదిర్బెక్, జోంగ్‌యి, నినో, రౌనక్ సాధ్వాని; చింగారి గల్ఫ్ టైటాన్స్: క్రిస్టాఫ్, మెమెద్యరోవ్, దుబోవ్, కోస్టెనిక్, పొలీనా, ఆండ్రీ ఈసిపెంకో; గాంజెస్ గ్రాండ్‌మాస్టర్స్: ఆనంద్, రిచర్డ్, లీనియర్ పీరెజ్, యిఫాన్, బెల్లా, సిందరోవ్; ఎస్జీ ఆల్ఫిన్ వారియర్స్: కార్ల్‌సన్, గుకేశ్, అర్జున్, ఎలిజబెత్, ఐరీనా, ప్రజ్ఞానంద; అప్‌గ్రాడ్ ముంబా మాస్టర్స్: మ్యాక్జిమ్ వాషియర్, విదిత్, గ్రిషుక్, హంపి, హారిక, జొనాస్; త్రివేణి కాంటినెంటల్ కింగ్స్: లీరెన్, వీ యీ, యాంగ్‌యి, కేతెరీనా లాగ్నో, నానా జాగ్నిడ్జ్.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
దిల్లీ మద్యం కేసులో అప్రూవర్లుగా మాగుంట రాఘవ్, దినేష్ అరోరా
-
RK Roja: తెదేపాను వీడినప్పటి నుంచి కక్ష కట్టారు: మంత్రి రోజా
-
YS Jagan: రేపు దిల్లీకి సీఎం జగన్.. హఠాత్తుగా సామర్లకోట పర్యటన వాయిదా
-
స్నేహితులను వరించిన అదృష్టం.. లాటరీలో రూ.కోటిన్నర గెలుపు
-
Engineering Counselling: ఏపీలో ఇంజినీరింగ్‌లో మూడో విడత కౌన్సెలింగ్ ఎత్తివేత
-
Guntur: సహజీవనం నేపథ్యంలో వివాదం.. యువకుడిపై మహిళ యాసిడ్ దాడి