WTC Final: భారత్‌ ఈ రోజు పుంజుకోకుంటే..

తొలి డబ్ల్యూటీసీ ఫైనల్లో అనూహ్య ఓటమి తర్వాత, రెండో ప్రయత్నంలో అయినా టైటిల్‌ సాధించాలని ఎన్నో ఆశలతో బరిలోకి దిగిన భారత్‌కు.. తొలి రోజే ఓవల్‌లో ఎదురు గాలి వీచింది. మ్యాచ్‌ను బాగానే ఆరంభించినా.. ఆ తర్వాత పట్టువిడిచింది భారత్‌.

Updated : 08 Jun 2023 07:54 IST

తొలి డబ్ల్యూటీసీ ఫైనల్లో అనూహ్య ఓటమి తర్వాత, రెండో ప్రయత్నంలో అయినా టైటిల్‌ సాధించాలని ఎన్నో ఆశలతో బరిలోకి దిగిన భారత్‌కు.. తొలి రోజే ఓవల్‌లో ఎదురు గాలి వీచింది. మ్యాచ్‌ను బాగానే ఆరంభించినా.. ఆ తర్వాత పట్టువిడిచింది భారత్‌. ఆస్ట్రేలియా ఇంతగా పైచేయి సాధించినందుకు భారత బౌలర్లను పూర్తిగా నిందించలేం. ఓవల్‌లో మధ్యాహ్నం నుంచి బాగా ఎండకాయడంతో పిచ్‌లో మార్పు వచ్చింది. పరిస్థితులు బ్యాటింగ్‌కు పూర్తి అనుకూలంగా మారిపోయాయి. ఉదయం లాగా సీమ్‌ కదలికలు కనిపించలేదు. బంతి అనుకున్నంతగా స్వింగ్‌ కాలేదు. రెండో రోజు ఉదయం మళ్లీ పరిస్థితులు మారి బ్యాటింగ్‌ కష్టంగా మారొచ్చని అంచనా. ఆ పరిస్థితుల్లో బౌలర్లు ఎంత వేగంగా వికెట్లు తీస్తారు.. ఎంత త్వరగా ఆస్ట్రేలియాను ఆలౌట్‌ చేస్తారన్నది కీలకం. స్కోరు 450 దాటితే భారత్‌ డ్రా కోసం పోరాడటం తప్ప, విజయం గురించి ఆలోచించే పరిస్థితి ఉండదు. భారత్‌ బ్యాటింగ్‌ చేసే సమయానికి పరిస్థితులు ఎలా ఉంటాయన్నది కీలకం. పిచ్‌ బౌలింగ్‌కు ఏమాత్రం అనుకూలంగా ఉన్నా.. స్టార్క్‌, కమిన్స్‌, బోలాండ్‌ త్రయాన్ని ఎదుర్కోవడం మన బ్యాటర్లకు కఠిన సవాలే. బ్యాటర్లు పట్టుదల ప్రదర్శించకుంటే సరైన ఆరంభం లభించకుంటే మ్యాచ్‌ను ముగించడానికి ఆసీస్‌కు ఎక్కువ రోజులు పట్టకపోవచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని