ఎవరిదో పైచేయి!
ఒకరేమో ప్రపంచ రికార్డు గ్రాండ్‌స్లామ్ టైటిల్‌పై కన్నేసిన అత్యంత విజయవంతమైన, అనుభవజ్ఞుడైన దిగ్గజ ఆటగాడు. ఇంకొకరేమో చిన్నవయసులోనే నంబర్‌వన్ ర్యాంకు సాధించి,
జకోవిచ్ × అల్కరాస్
సెమీఫైనల్ నేడు
ఒకరేమో ప్రపంచ రికార్డు గ్రాండ్‌స్లామ్ టైటిల్‌పై కన్నేసిన అత్యంత విజయవంతమైన, అనుభవజ్ఞుడైన దిగ్గజ ఆటగాడు. ఇంకొకరేమో చిన్నవయసులోనే నంబర్‌వన్ ర్యాంకు సాధించి, భవిష్యత్తు సూపర్‌స్టార్‌గా టెన్నిస్ పండితులు అంచనా వేస్తున్న కుర్రాడు. ఇద్దరిపైనా భారీ అంచనాలే ఉన్నాయి. ఇద్దరూ టైటిల్ ఫేవరెట్లే. ఫ్రెంచ్ ఓపెన్‌లో రసవత్తర సమయానికి రంగం సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో టాప్ సీడ్ అల్కరాస్.. మూడో సీడ్ జకోవిచ్ (సెర్బియా)ను ఢీకొంటాడు. టోర్నీ డ్రా తీసినప్పుడే వీళ్లిద్దరు సెమీస్‌లో తలపడే అవకాశముండడం అభిమానుల్లో ఎంతో ఆసక్తిరేపింది. ఈ నేపథ్యంలో రసవత్తర పోరు కోసం వాళ్లు ఎదురుచూస్తున్నారు. ఇంతకుముందు వీళ్లిద్దరు ఒకే ఒక్కసారి తలపడగా.. అల్కరాస్ విజేతగా నిలిచాడు. 36 ఏళ్ల జకోవిచ్.. 23వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌తో అత్యధిక మేజర్ టైటిళ్లు గెలిచిన ఆటగాడిగా రికార్డు సృష్టించాలనే లక్ష్యంతో ఉన్న సంగతి తెలిసిందే.
సెమీస్‌లో రూడ్: నాలుగో సీడ్ కాస్పర్ రూడ్ (నార్వే) సెమీఫైనల్లో ప్రవేశించాడు. క్వార్టర్‌ఫైనల్లో అతడు 6-1, 6-2, 3-6, 6-3తో ఆరో సీడ్ హోల్గర్ రూన్ (డెన్మార్క్)పై విజయం సాధించాడు. ఫైనల్లో చోటు కోసం అతడు అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ)తో తలపడతాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Imran Tahir - MS Dhoni: ధోనీని అధిగమించిన ఇమ్రాన్ తాహిర్.. అశ్విన్‌కు థ్యాంక్స్ చెప్పిన వెటరన్ ప్లేయర్!
-
Pawan Kalyan: అక్టోబర్ 1 నుంచి పవన్ నాలుగో విడత ‘వారాహి’ యాత్ర
-
TS News: త్వరలో నియోజకవర్గానికో డయాలసిస్ కేంద్రం: హరీశ్ రావు
-
US visa: అమెరికాలో చదువు.. రికార్డు స్థాయిలో 90వేల వీసాలు జారీ
-
పిల్లలతో కలిసి మా సినిమా చూడొద్దు: స్టార్ హీరో
-
TS High Court: నోటరీ స్థలాల క్రమబద్ధీకరణపై తెలంగాణ హైకోర్టు స్టే