సిరాజ్‌ పోరాట యోధుడు

టీమ్‌ఇండియా పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ అద్భుతమైన పోరాట యోధుడిలా కనిపిస్తున్నాడని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ రికీ పాంటింగ్‌ కితాబిచ్చాడు.

Published : 10 Jun 2023 03:05 IST

లండన్‌: టీమ్‌ఇండియా పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ అద్భుతమైన పోరాట యోధుడిలా కనిపిస్తున్నాడని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ రికీ పాంటింగ్‌ కితాబిచ్చాడు. భారత పేసర్లు ఫుల్లర్‌ లెంగ్త్‌ బంతులు వేయకుండా మ్యాచ్‌లో జట్టును కిందకి లాగేసుకున్నారని అభిప్రాయపడ్డాడు. ‘‘సిరాజ్‌ బౌలింగ్‌ నన్నెంతో ఆకట్టుకుంది. అతను అద్భుతమైన పోరాట యోధుడిలా కనిపిస్తున్నాడు. పరిస్థితులు సానుకూలంగా లేనప్పుడు అలాంటి ఆటగాళ్లు జట్టులో ఉండటం అవసరం. ఇన్నింగ్స్‌ ఆసాంతం అతని పేస్‌ ఏమాత్రం తగ్గలేదు. తొలి రోజు మొదటి బంతి నుంచి మర్నాడు మధ్యాహ్నం వరకు నిలకడగా ఒకే వేగంతో బంతులు సంధించాడు. మొదటి రోజు తొలి సెషన్‌లో షార్ట్‌ పిచ్‌ బంతులు వేయడం ద్వారా భారత బౌలర్లు జట్టును కిందకి లాగేసుకున్నారు. కొత్త డ్యూక్‌ బంతితో ఫుల్లర్‌ లెంగ్త్‌లో బౌలింగ్‌ చేయాల్సింది’’ అని పాంటింగ్‌ తెలిపాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని