అత్యధిక ఛేదన 263

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో మూడు రోజుల ఆటే అయింది. కానీ అప్పుడే భారత్‌కు ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ఓవల్‌ మైదానం రికార్డు చూస్తే అద్భుతాలు జరిగితే తప్ప ఈ మ్యాచ్‌లో టీమ్‌ఇండియా ఓటమి తప్పించుకోవడం కష్టమే అనిపిస్తోంది.

Published : 10 Jun 2023 03:04 IST

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో మూడు రోజుల ఆటే అయింది. కానీ అప్పుడే భారత్‌కు ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ఓవల్‌ మైదానం రికార్డు చూస్తే అద్భుతాలు జరిగితే తప్ప ఈ మ్యాచ్‌లో టీమ్‌ఇండియా ఓటమి తప్పించుకోవడం కష్టమే అనిపిస్తోంది. ఈ స్టేడియంలో అత్యధిక ఛేదన 263 మాత్రమే. అది కూడా ఎప్పుడో 121 ఏళ్ల కిందట ఆస్ట్రేలియాపై ఇంగ్లాండ్‌ సాధించింది. ఆస్ట్రేలియా ఆధిక్యం ఇప్పటికే 296కు చేరుకుంది. ఆ జట్టు చేతిలో ఇంకా ఆరు వికెట్లున్నాయి. కాబట్టి లక్ష్యం 400కు చేరువయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇక్కడ జరిగిన 104 టెస్టుల్లో 26 సార్లు మాత్రమే నాలుగో ఇన్నింగ్స్‌లో లక్ష్యాన్ని ఛేదించిన జట్లు గెలిచాయి. ఈ నేపథ్యంలో నాలుగో ఇన్నింగ్స్‌లో భారీ లక్ష్యాన్ని ఛేదించి భారత్‌ డబ్ల్యూటీసీ ట్రోఫీని సాధించడం కష్ట సాధ్యమే. చివరి రెండు రోజుల్లో వర్షం పడి.. రిజర్వ్‌ డే రోజు కూడా వరుణుడు పలకరిస్తే తప్ప ఓటమిని తప్పించుకోవడం భారత్‌కు తేలిక కాదు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని