భారత జూనియర్‌ జట్టులో తార, ఆయుష్‌

ఆసియా జూనియర్‌ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత జట్టులో తార షా, ఆయుష్‌ శెట్టిలకు చోటు లభించింది. జులై 7 నుంచి 16 వరకు ఇండోనేసియాలో జరిగే ఈ టోర్నీ కోసం శుక్రవారం భారత జట్టును ప్రకటించారు.

Published : 10 Jun 2023 03:04 IST

దిల్లీ: ఆసియా జూనియర్‌ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత జట్టులో తార షా, ఆయుష్‌ శెట్టిలకు చోటు లభించింది. జులై 7 నుంచి 16 వరకు ఇండోనేసియాలో జరిగే ఈ టోర్నీ కోసం శుక్రవారం భారత జట్టును ప్రకటించారు. బాలికల సింగిల్స్‌లో తార, రక్షిత శ్రీ.. బాలుర సింగిల్స్‌లో ఆయుష్‌, లక్ష్య శర్మ జట్టులో స్థానం సంపాదించారు. బాలుర డబుల్స్‌లో నికోలస్‌ నాథన్‌ రాజ్‌- తుషార్‌ సువీర్‌, బాలికల డబుల్స్‌లో రాధిక శర్మ- తన్వి శర్మ, మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సమర్‌వీర్‌- రాధిక శర్మలు భారత్‌ తరఫున బరిలో దిగనున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు