WTC Final: ఆ పోరాటం మళ్లీ చూస్తామా?

ఆస్ట్రేలియాలో 2020-21 బోర్డర్‌ గావస్కర్‌ సిరీస్‌. తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 36కే కుప్పకూలిన భారత్‌ అవమానకర ఓటమి మూటగట్టుకుంది.

Updated : 11 Jun 2023 07:59 IST

ఆస్ట్రేలియాలో 2020-21 బోర్డర్‌ గావస్కర్‌ సిరీస్‌. తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 36కే కుప్పకూలిన భారత్‌ అవమానకర ఓటమి మూటగట్టుకుంది. కోహ్లి లాంటి కొంతమంది కీలక ఆటగాళ్లు దూరమైనా.. సారథ్య బాధ్యతలు స్వీకరించిన రహానె రెండో టెస్టులో జట్టుకు విజయాన్ని అందించాడు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీతో అదరగొట్టాడు. ఇక మూడో టెస్టు డ్రాగా ముగిసింది. సిరీస్‌ నిర్ణయాత్మక నాలుగో టెస్టులో.. అదీ బ్రిస్బేన్‌లో గెలవాలంటే భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ ఛేదనలో 328 పరుగులు చేయాలి. కష్టమే అనుకున్నారంతా. కానీ శుభ్‌మన్‌ గిల్‌ (91), పుజారా (56), పంత్‌ (89 నాటౌట్‌) అసాధారణ బ్యాటింగ్‌ ప్రదర్శనతో లక్ష్యాన్ని అందుకున్న టీమ్‌ఇండియా అద్భుత విజయాన్ని అందుకుంది. మళ్లీ ఇప్పుడు డబ్ల్యూటీసీ ఫైనల్లో అదే ప్రత్యర్థిపై.. మళ్లీ అలాంటి ఛేదన పరిస్థితుల్లోనే రోహిత్‌ సేన ఆదివారం ఏమైనా అద్భుతం చేస్తుందా అన్న ఆశలు అభిమానుల్లో ఉన్నాయి. ఈ ఫైనల్లో తొలి ఇన్నింగ్స్‌లో తడబడ్డా.. 444 పరుగుల ఛేదనలో రెండో ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా దీటుగానే స్పందిస్తోంది. జట్టు విజయానికి ఇంకా 280 పరుగులు కావాలి. చేతిలో ఏడు వికెట్లున్నాయి. క్రీజులో ఉన్న కోహ్లి, రహానె ఆత్మవిశ్వాసంతో ఆడుతున్నారు. మరి చివరి రోజు భారత్‌ మరోసారి అసాధ్యాన్ని అందుకుంటుందా? అన్నది చూడాలి.


ఆ రికార్డు విండీస్‌ది

టెస్ట్‌ క్రికెట్లో అత్యధిక లక్ష్య ఛేదన రికార్డు వెస్టిండీస్‌ పేరిట ఉంది. 2003లో ఆ జట్టు ఆస్ట్రేలియాపై 418 పరుగులు ఛేదించి గెలిచింది.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని