23.. అందేనా?

సవాళ్లను దాటి సాగుతున్న దిగ్గజ ఆటగాడు నొవాక్‌ జకోవిచ్‌.. పురుషుల సింగిల్స్‌లో అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లు నెగ్గిన ఆటగాడిగా చరిత్ర సృష్టించేందుకు కావాల్సింది ఒక్క విజయమే.

Updated : 11 Jun 2023 03:27 IST

చరిత్రపై కన్నేసిన జకోవిచ్‌
నేడు రూడ్‌తో ఫైనల్లో ఢీ
సా.6.30 నుంచి

పారిస్‌: సవాళ్లను దాటి సాగుతున్న దిగ్గజ ఆటగాడు నొవాక్‌ జకోవిచ్‌.. పురుషుల సింగిల్స్‌లో అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లు నెగ్గిన ఆటగాడిగా చరిత్ర సృష్టించేందుకు కావాల్సింది ఒక్క విజయమే. నాదల్‌తో సమానంగా 22 విజయాలతో ఉన్న జకో.. 23వ గ్రాండ్‌స్లామ్‌ ట్రోఫీతో శిఖరాగ్రానికి చేరేందుకు కావాల్సింది మరో గెలుపు మాత్రమే. ఆ చరిత్ర అందుకునేందుకు.. రికార్డు సృష్టించేందుకు ఒక్క అడుగు దూరంలో ఉన్న జకోవిచ్‌.. ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఫైనల్‌కు సిద్ధమయ్యాడు. ఆదివారం జరిగే ఈ తుదిపోరులో కాస్పర్‌ రూడ్‌ (నార్వే)ను ఈ సెర్బియా యోధుడు ఢీ కొట్టనున్నాడు. ప్రపంచ నంబర్‌వన్‌ అల్కరాస్‌తో సెమీస్‌లో విజయంతో ఆత్మవిశ్వాసంతో ఉన్న మూడో సీడ్‌ జకోనే ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌ అనడంలో సందేహం లేదు. ఫిట్‌నెస్‌ను కాపాడుకుంటూ.. కోర్టులో ఆధిపత్యం ప్రదర్శిస్తున్న 36 ఏళ్ల జకోను.. 24 ఏళ్ల రూడ్‌ ఎలా కట్టడి చేస్తాడన్నది ఆసక్తి రేపుతోంది. వరుసగా రెండో ఏడాది ఫ్రెంచ్‌ ఓపెన్‌లో ఫైనల్‌ చేరిన రూడ్‌ కూడా జోరుమీదున్నాడు. కానీ నిరుడు నాదల్‌ చేతిలో ఓటమి ఎదుర్కొన్న అతనికి.. ఇప్పుడు జకో రూపంలో కఠిన సవాలు ఎదురవుతోంది. ఇప్పటివరకూ గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్స్‌లో రెండు సార్లు (2022 ఫ్రెంచ్‌ ఓపెన్‌లో నాదల్‌ చేతిలో, యుఎస్‌ ఓపెన్‌లో అల్కరాస్‌ చేతిలో ఓటమి) ఆడిన రూడ్‌ గెలుపు రుచి చూడలేకపోయాడు.


2

ఇప్పటివరకూ ఆరు సార్లు ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఫైనల్లో తలపడ్డ జకో సాధించిన విజయాలు. నాలుగు సార్లు ఓటమి పాలయ్యాడు.



 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు