KL Rahul: ఒక్క ఇన్నింగ్స్‌తో అన్నిటికీ సమాధానం

ప్రపంచకప్‌ జట్టులో కేఎల్‌ రాహుల్‌ పేరు చూసిన వాళ్లలో చాలామందికి ఇది సరైన ఎంపికేనా అన్న సందేహం.

Updated : 12 Sep 2023 09:58 IST

ప్రపంచకప్‌ జట్టులో కేఎల్‌ రాహుల్‌ పేరు చూసిన వాళ్లలో చాలామందికి ఇది సరైన ఎంపికేనా అన్న సందేహం. ఎందుకంటే అతను గాయంతో నాలుగు నెలలకు పైగా మైదానానికి దూరంగా ఉన్నాడు. గాయానికి ముందు ఫామ్‌ ఏమంత గొప్పగా లేదు. ఆసియా కప్‌లో పాకిస్థాన్‌తో తొలి మ్యాచ్‌ ద్వారా  పునరాగమనం చేస్తాడనుకుంటే.. మళ్లీ ఇంకేదో చిన్న గాయం అంటూ టోర్నీలో తొలి రెండు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. తొడ గాయం తగ్గిందనుకుంటే ఇంకో గాయమా? ఇలాంటి అనిశ్చిత స్థితిలో ఉన్న ఆటగాడిని ప్రపంచకప్‌లో ఆడించడం అవసరమా అన్న ప్రశ్న చాలామందిలో తలెత్తింది. అయితే పాకిస్థాన్‌తో సూపర్‌-4 మ్యాచ్‌లో సూపర్‌ ఇన్నింగ్స్‌తో అన్ని ప్రశ్నలకూ సమాధానం చెప్పాడు.

తన ఫామ్‌, ఫిట్‌నెస్‌పై ఏ సందేహాలూ పెట్టుకోవాల్సిన అవసరం లేదని ఈ ఇన్నింగ్స్‌తో అతను చాటి చెప్పాడు. బలమైన పాక్‌ బౌలర్లను ఎదుర్కొంటూ సుదీర్ఘ సమయం ఏ తడబాటూ లేకుండా బ్యాటింగ్‌ చేయడమే కాక.. చక్కటి స్ట్రోక్‌ప్లేతో అతను మెప్పించాడు. అంతే కాక కూర్పు, మిడిలార్డర్‌ సమస్యలకూ అతను పరిష్కారం చూపాడు. ఇషాన్‌ కిషన్‌ నిలకడగా ఆడుతుండటంతో అతణ్ని కాదని రాహుల్‌ను తుది జట్టుకు ఎంపిక చేయాల్సిన పరిస్థితి వస్తే పెద్ద ఎత్తున విమర్శలు తలెత్తేవి. కానీ అనుభవం, ఫామ్‌ పరంగా తనే సరైన ఎంపిక అని చాటాడు. మరోవైపు బలహీనంగా కనిపిస్తున్న మిడిలార్డర్‌కు కూడా అతను భరోసానిచ్చాడు. అంతే కాక పాక్‌ ఇన్నింగ్స్‌లో వికెట్‌ కీపింగ్‌ కూడా చేసి ఆకట్టుకున్నాడు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు