చోప్రా చేజారిన డైమండ్‌ లీగ్‌ ట్రోఫీ

ఒలింపిక్‌, ప్రంపచ ఛాంపియన్‌ జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా డైమండ్‌ లీగ్‌ ఛాంపియన్స్‌ టైటిల్‌ను నిలబెట్టుకోలేకపోయాడు. శనివారం రాత్రి జరిగిన గ్రాండ్‌ ఫైనల్లో చోప్రా 83.80 మీటర్లు జావెలిన్‌ను విసిరి రెండో స్థానంలో నిలిచాడు. గత నెలలో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణంతో మెరిసిన చోప్రా.. శనివారం ఉత్తమ ప్రదర్శన చేయలేకపోయాడు.

Updated : 18 Sep 2023 15:23 IST

యూజీన్‌ (అమెరికా): ఒలింపిక్‌, ప్రంపచ ఛాంపియన్‌ జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా డైమండ్‌ లీగ్‌ ఛాంపియన్స్‌ టైటిల్‌ను నిలబెట్టుకోలేకపోయాడు. శనివారం రాత్రి జరిగిన గ్రాండ్‌ ఫైనల్లో చోప్రా 83.80 మీటర్లు జావెలిన్‌ను విసిరి రెండో స్థానంలో నిలిచాడు. గత నెలలో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణంతో మెరిసిన చోప్రా.. శనివారం ఉత్తమ ప్రదర్శన చేయలేకపోయాడు. రెండుసార్లు ఫౌల్‌ చేసిన చోప్రా 83.80 మీటర్ల త్రో విసిరాడు. వాద్లెచ్‌ (చెక్‌ రిపబ్లిక్‌) 84.24 మీ దూరం జావెలిన్‌ను విసిరి డైమండ్‌ లీగ్‌ ఛాంపియన్‌గా నిలిచాడు. హెలాండర్‌ (83.74 మీ- ఫిన్లాండ్‌) మూడో స్థానం సాధించాడు. చోప్రా 85 మీ. కంటే తక్కువ దూరం విసరడం ఈ సీజన్‌లో ఇదే ప్రథమం. 2022 జ్యురిచ్‌ డైమండ్‌ లీగ్‌ ఫైనల్లో చోప్రా 88.44 మీ త్రో స్వర్ణం సాధించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని