కళ్లు మెరిసేలా.. మనసు మెచ్చేలా!
పర్వతాలు, నదులు, సరస్సులు, అంతరిక్షం, చందమామ.. ఇంకా మరెన్నో శనివారం హాంగ్‌జౌలోని స్టేడియానికి వచ్చాయి.
అట్టహాసంగా ఆసియా క్రీడల ఆరంభోత్సవం
పర్వతాలు, నదులు, సరస్సులు, అంతరిక్షం, చందమామ.. ఇంకా మరెన్నో శనివారం హాంగ్‌జౌలోని స్టేడియానికి వచ్చాయి. వీటితో కలిసి కళాకారులు ప్రదర్శన ఇచ్చారు. అట్టహాసంగా నిర్వహించిన ఆసియా క్రీడల ఆరంభోత్సవ వేడుకలో జరిగిన మాయే ఇది. సాంకేతికత ఉపయోగించి ఈ ప్రారంభోత్సవాన్ని చైనా ఘనంగా నిర్వహించింది. గ్రాఫిక్స్ మాయాజాలంతో అథ్లెట్లు, వీక్షకుల మనసులను దోచుకుంది. చైనా చారిత్రక, సాంస్కృతిక వైభవానికి అద్దం పట్టేలా.. శాస్త్ర, సాంకేతిక రంగాల అభివృద్ధిని ప్రతిబింబించేలా ఈ కార్యక్రమం సాగింది. ఎంతో ఆహ్లాదంగా, అందంగా సాగిన కళాకారుల ప్రదర్శనలు మనసుకు హత్తుకున్నాయి.
హాంగ్‌జౌ: 19వ ఆసియా క్రీడలను చైనా అధికారికంగా ప్రారంభించింది. శనివారం కన్నుల పండుగగా సాగిన ఆరంభోత్సవ కార్యక్రమం ఆద్యంతం అలరించింది. సరికొత్తగా తీర్చిదిద్దిన హాంగ్‌జౌ ఒలింపిక్ స్పోర్ట్స్ కేంద్రం స్టేడియం దీనికి వేదికైంది. 80 వేల సామర్థ్యం కలిగిన పెద్ద తామర పువ్వుగా అభివర్ణించే ఈ స్టేడియం పూర్తిగా నిండిపోయింది. నీరు, పర్వతాలు, చంద్రుడు నేపథ్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో ప్రధానంగా హాంగ్‌జౌలో ప్రవహించే కియాంటాంగ్ నదిని నేపథ్యంగా తీసుకున్నారు. శరదృతువు వెలుగుల్లో నీరుగా పేర్కొంటూ సాగిన భారీ నృత్య ప్రదర్శనతో ఈ వేడుక ఆరంభమైంది. చైనా వారసత్వం, ఆ దేశ సాంకేతిక పురోగతి, కృత్రిమ మేధతో పాటు పర్యావరణ అనుకూల వ్యవహారానికి నివాళిగా ఈ ప్రదర్శన నిలిచింది. ఆ దేశ జాతీయ పతాకాన్ని ఎగరేసి, జాతీయ గీతాన్ని ఆలపించారు. మస్కట్ల ప్రదర్శన ఆకట్టుకుంది. ఆ తర్వాత ఈ క్రీడల్లో పాల్గొనే దేశాల కవాతు మొదలైంది. మొదట అఫ్గానిస్థాన్ బృందం వచ్చింది. ఈ కవాతులో భారత అథ్లెట్లు సంప్రదాయ వస్త్రాలు ధరించి పాల్గొన్నారు. మహిళలు చీర కట్టుకోగా.. పురుషులు కుర్తా, పైజామా, పైన కోటు ధరించారు. పురుషుల హాకీ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్, అగ్రశ్రేణి బాక్సర్ లవ్లీనా బోర్గోహెయిన్ కలిసి జాతీయ పతాకాన్ని పట్టుకుని మన బృందాన్ని నడిపించారు. చివరగా చైనా బృందం రాకతో కవాతు ముగిసింది. అనంతరం ఆసియా క్రీడలు ప్రారంభమైనట్లు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ప్రకటించారు. వెంటనే బాణాసంచా వెలుగులతో స్టేడియం వెలిగిపోయింది. ఆ వెంటనే ఆసియా ఒలింపిక్ మండలి జెండాను ఆవిష్కరించారు. చైనా సాంస్కృతిక వారసత్వానికి ప్రతిబింబంగా ఓ వీడియో ప్రదర్శించారు. పర్వతాలు, సరస్సులు, జలపాతల నేపథ్యంలో కళాకారుల ప్రదర్శన ఆకట్టుకుంది. అనంతరం గాల్లో తేలుతూ ఇద్దరు చైనా కళాకారుల (అమ్మాయి, అబ్బాయి) ప్రదర్శన కూడా అలరించింది. ఆసియా క్రీడల జ్యోతిని స్టేడియంలో అథ్లెట్లు ఒకరి తర్వాత ఒకరు అందుకుంటూ సాగారు. మరోవైపు జ్యోతి పట్టుకుంటూ డిజిటల్ ఆకారం నగరం మొత్తం పరుగెత్తడం కనిపించింది. చివరకు ఆ ఆకారం స్టేడియానికి చేరుకోగానే.. చైనా అథ్లెట్ భారీ జ్యోతిని వెలిగించాడు. కళ్లు మిరిమిట్లు గొలిపేలా బాణాసంచా వెలుగులతో ఈ కార్యక్రమం ముగిసింది. పర్యావరణ హితం కోసం డిజిటల్ బాణాసంచా వెలుగులను ఉపయోగించడం విశేషం.
ఆసియా క్రీడల్లో ఈనాడు
బాక్సింగ్: ప్రీతి × సిలీనా (జోర్డాన్)- ఉ.11.45; నిఖత్ జరీన్ × న్యూయెన్ (వియత్నాం)- సా.4.30
క్రికెట్: మహిళల సెమీస్ (భారత్ × బంగ్లాదేశ్)- ఉ.6.30
చెస్: వ్యక్తిగత తొలి, రెండో రౌండ్లు(విదిత్, అర్జున్, హంపి, హారిక)- మ.12.30
ఫుట్‌బాల్: మహిళలు (భారత్ × థాయ్‌లాండ్)- మ.1.30; పురుషులు (భారత్ × మయన్మార్)- సా.5
హాకీ- పురుషులు (భారత్ × ఉజ్బెకిస్థాన్)- ఉ.8.45
రోయింగ్: మహిళల లైట్‌వెయిట్ డబుల్ స్కల్స్ ఫైనల్ బి (పతక ఈవెంట్ కాదు) (కిరణ్, అన్షిక)- ఉ.6.30; పురుషుల లైట్‌వెయిట్ డబుల్ స్కల్స్ ఫైనల్ ఎ (అర్జున్ లాల్, అర్వింద్)- ఉ.7.10; పురుషుల డబుల్ స్కల్స్ ఫైనల్ ఎ (పర్మిందర్, సత్నాం)- ఉ.8; మహిళల కాక్స్‌లెస్ ఫోర్ ఫైనల్ ఎ (అశ్వతి, మృణామయి, ప్రియ, రుక్మిణి)- ఉ 8.20; పురుషుల కాక్స్‌లెస్ పెయిర్ ఫైనల్ ఎ (బాబులాల్, లేఖ్ రామ్)- ఉ.8.40; పురుషుల కాక్స్‌డ్ ఎయిట్ ఫైనల్ ఎ (చరణ్‌జీత్, డీయూ పాండే, నరేశ్, నీరజ్, నీతేష్, ఆశిష్, భీమ్, జస్విందర్, పునిత్)- ఉ.9
షూటింగ్: మహిళల 10మీ. ఎయిర్ రైఫిల్ టీమ్, వ్యక్తిగత క్వాలిఫికేషన్, ఫైనల్ (ఆశి, మెహులి, రమిత)- ఉ.6
స్విమ్మింగ్: పురుషుల 100మీ.ఫ్రీస్టైల్ హీట్స్, ఫైనల్ (ఆనంద్, తనీష్)- ఉ.7.30; పురుషుల 100మీ.బ్యాక్‌స్ట్రోక్ హీట్స్, ఫైనల్ (శ్రీహరి నటరాజ్, ఉత్కర్ష్)- ఉ.7.30; మహిళల 4×100మీ.ఫ్రీస్టైల్ రిలే హీట్స్, ఫైనల్ (జాహ్నవి, ధినిధి, మాన పటేల్, శివాంగి)- ఉ.7.30
టేబుల్ టెన్నిస్: మహిళల ప్రిక్వార్టర్స్ (భారత్ × థాయ్‌లాండ్)- ఉ.7.30; పురుషుల ప్రిక్వార్టర్స్ (భారత్ × కజకిస్థాన్)- ఉ.9.30
నేటి నుంచే పతక వేట
రోయింగ్‌లో అయిదు ఫైనల్స్‌లో భారత అథ్లెట్లు
ఆసియా క్రీడల్లో భారత్‌కు ఆదివారం తొలి పతకం దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. రోయింగ్‌లో ఏకంగా అయిదు విభాగాల్లో భారత అథ్లెట్లు ఫైనల్లో తలపడబోతున్నారు. మరోవైపు షూటింగ్‌లోనూ మహిళల 10మీ. ఎయిర్ రైఫిల్‌లో టీమ్‌తో పాటు వ్యక్తిగత విభాగాల్లోనూ నేడే క్వాలిఫికేషన్‌తో పాటు ఫైనల్స్ జరుగుతాయి. మరి మన షూటర్లు రమిత, మెహులి ఘోష్, ఆశి చోక్సీ ఏం చేస్తారో చూడాలి. ఇక మహిళల క్రికెట్ సెమీస్‌లో బంగ్లాదేశ్‌తో భారత్ తలపడనుంది. ఇందులో గెలిస్తే టీమ్‌ఇండియాకు పతకం ఖాయమవుతుంది.
నిఖత్‌కు సవాలు..: తొలిసారి ఆసియా క్రీడల్లో బరిలో దిగుతోన్న నిఖత్ జరీన్‌కు తొలి రౌండ్లోనే కఠిన సవాలు ఎదురు కానుంది. మహిళల 50 కేజీల విభాగం తొలి రౌండ్లో నిఖత్.. న్యూయెన్ తి తామ్ (వియత్నాం)తో పోటీపడనుంది. ఈ ఏడాది ప్రపంచ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో న్యూయెన్‌పైనే నిఖత్ గెలిచిన సంగతి తెలిసిందే. ఈ సవాలు దాటితే సెమీస్‌లో నిఖత్‌కు.. రెండు సార్లు ప్రపంచ కాంస్య విజేత రక్సత్ (థాయ్‌లాండ్) ఎదురయ్యే అవకాశముంది. మరోవైపు 75 కేజీల విభాగంలో లవ్లీనాకు తొలి రౌండ్లో బై లభించింది. ఇప్పుడామె క్వార్టర్స్‌లో సియాంగ్ (కొరియా)ను ఢీ కొడుతుంది. ఈ ఒక్క బౌట్ గెలిచినా లవ్లీనా పతకం దక్కించుకుంటుంది. ఆసియా క్రీడల్లో సత్తాచాటే బాక్సర్లు.. పారిస్ ఒలింపిక్స్ బెర్తులూ గెలుచుకునే అవకాశం ఉంది.
హాకీ.. పారిస్ లక్ష్యంగా..
పారిస్ ఒలింపిక్స్ బెర్తు లక్ష్యంగా ఆసియా క్రీడల్లో అడుగుపెట్టిన భారత పురుషుల హాకీ జట్టు ఆదివారం తన తొలి మ్యాచ్ (పూల్- ఎ)లో ఉజ్బెకిస్థాన్‌ను ఢీ కొడుతుంది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో మూడో స్థానంలో ఉన్న హర్మన్‌ప్రీత్ సేననే.. ఆసియా క్రీడల్లో అత్యుత్తమ ర్యాంకు జట్టు.గత క్రీడల్లో కాంస్యం గెలిచిన పురుషుల జట్టు.. ఈ సారి పసిడి నెగ్గాలనే లక్ష్యంతో ఉంది. పూల్- ఎలో పాకిస్థాన్, ఉజ్బెకిస్థాన్, సింగపూర్, జపాన్, బంగ్లాదేశ్‌తో కలిసి భారత్ ఉంది. ఇక చెస్‌లో అదరగొట్టేందుకు గుకేశ్, విదిత్, అర్జున్, హరికృష్ణ, ప్రజ్ఞానంద, కోనేరు హంపి, హారిక, వైశాలి, వంతిక, సవిత సిద్ధమయ్యారు. మరోవైపు ఆసియా క్రీడల్లో తొలిసారి పూర్తిస్థాయిలో నిర్వహిస్తున్న ఈ- స్పోర్ట్స్‌లోనూ భారత్ ప్రాతినిథ్యం వహిస్తోంది. లీగ్ ఆఫ్ లెజెండ్స్ గేమ్‌లో టాప్ సీడ్ కారణంగా భారత్ నేరుగా క్వార్టర్స్ ఆడనుంది.
ప్రిక్వార్టర్స్‌లో టీటీ జట్లు: ఆసియా క్రీడల టేబుల్ టెన్నిస్‌లో భారత పురుషుల, మహిళల జట్లు ప్రిక్వార్టర్స్ చేరాయి. శనివారం మహిళల గ్రూప్- ఎఫ్ మ్యాచ్‌లో భారత్ 3-0తో నేపాల్‌ను చిత్తుచేసింది. దియా 11-1, 11-6, 11-8తో శ్రేష్ఠపై, ఐహిక 11-3, 11-7, 11-2తో నబితపై, సుతీర్థ 11-1, 11-5, 11-2తో ఎవానాపై గెలిచారు. గ్రూప్‌లో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన భారత్.. అగ్రస్థానంతో ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. మరోవైపు పురుషుల గ్రూప్- ఎఫ్ మ్యాచ్‌లో భారత్ 3-0తోనే తజకిస్థాన్‌ను ఓడించింది. మానవ్ 11-8, 11-5, 11-8తో అఫ్జల్‌ఖాన్‌పై, మానుష్ 13-11, 11-7, 11-5తో సుల్తానోవ్‌పై, హర్మీత్ 11-1, 11-3, 11-5తో ఇబ్రోకిమ్‌పై నెగ్గారు. ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన పురుషుల జట్టు కూడా అగ్రస్థానంతో ముందంజ వేసింది. మరోవైపు సెయిలింగ్‌లో భారత్‌కు ఆశించిన ఫలితాలు రాలేదనే చెప్పాలి. మరో అయిదు రేసులు మిగిలి ఉన్న పురుషుల డింఘీ ఈవెంట్‌లో విష్ణు రెండో స్థానానికి పడిపోయాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Ashish Nehra: టీ20లకు భారత్ కోచ్ పదవి.. ఆశిశ్ నెహ్రా వద్దనడానికి కారణాలు ఇవేనా?
గుజరాత్ టైటాన్స్ కోచ్ ఆశిశ్ నెహ్రాను (Ashish Nehra) టీమ్ఇండియా కోచింగ్ పదవి వరించినా.. వద్దని చెప్పడం క్రికెట్ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేశాయి. -
Cricket News: ఇప్పుడెందుకు ఈ టీ20 సిరీస్..? పందెం కోల్పోయానంటున్న కెవిన్.. టీమ్‌ఇండియాతోనూ బజ్‌బాల్!
-
Rahul Dravid: ‘టీ20 ప్రపంచకప్ ఉన్న ఈ తరుణంలో’.. కోచ్‌గా ద్రవిడ్ కొనసాగింపుపై గంభీర్ స్పందన
Rahul Dravid: టీమ్ఇండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ సహా ఇతర కోచింగ్ బృంద కాంట్రాక్ట్‌ను బీసీసీఐ పొడిగించింది. దీనిపై మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ తాజాగా స్పందించారు. -
Rahul Dravid: ఇన్నింగ్స్ ఇంకా ఉంది
సందిగ్ధత తొలగింది. ఊహాగానాలకు తెరపడింది. టీమ్ఇండియా ప్రధాన కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ కొనసాగనున్నాడు. అతడి కాంట్రాక్ట్‌ను పొడిగించాలని బీసీసీఐ నిర్ణయించింది. వీవీఎస్ లక్ష్మణ్ ఎన్సీఏలోనే ఉంటాడు. -
Dravid: మెప్పించాడు ఇలా...
జూనియర్ కోచ్‌గా, ఎన్సీఏ అధిపతిగా తనదైన ముద్ర వేసినా, మంచి పేరు తెచ్చుకున్నా ద్రవిడ్ ఏనాడు టీమ్ఇండియా కోచ్ పదవిపై ఆసక్తిని ప్రదర్శించలేదు. బీసీసీఐ పెద్దలు ప్రయత్నించినా ఎందుకో అతడు విముఖత వ్యక్తం చేశాడు. కానీ ద్రవిడ్ ఒకప్పటి సహచరుడైన గంగూలీ (అప్పటి బీసీసీఐ అధ్యక్షుడు).. రవిశాస్త్రి అనంతరం కోచ్‌గా ఉండేలా ద్రవిడ్‌ను ఒప్పించగలిగాడు. -
Rohit Sharma: మరి రోహిత్?
దక్షిణాఫ్రికా పర్యటన కోసం సెలక్షన్ కమిటీ గురువారం భారత జట్లను ప్రకటించనుంది. టీ20ల్లో తిరిగి భారత్‌కు నాయకత్వం వహించాలని రోహిత్ శర్మను బీసీసీఐ పెద్దలు ఒప్పించడానికి ప్రయత్నించే అవకాశముంది. 2022 ప్రపంచకప్ సెమీఫైనల్లో భారత్ ఓడినప్పటి నుంచి రోహిత్ పొట్టి క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. -
IND vs AUS: ఇలాంటి పరిస్థితుల్లో ఎంతైనా ఛేదించొచ్చు
ఆస్ట్రేలియాతో మూడో టీ20లో భారత పేసర్ల వైఫల్యానికి విపరీతమైన మంచు కారణమని ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ అన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఓవర్‌కు 14 పరుగుల లక్ష్య ఛేదన కూడా సాధ్యమేనని తెలిపాడు. 222 స్కోరును కాపాడుకోలేకపోయిన భారత్.. చివరి 5 ఓవర్లలో 80 పరుగులు సమర్పించుకుంది. -
ఆ అనుభవం ఉపయోగపడుతుంది
గొప్ప సారథుల ఆధ్వర్యంలో ఆడిన అనుభవం తనకెంతో ఉపయోగపడుతుందని గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ అన్నాడు. విరాట్ కోహ్లి, రోహిత్‌శర్మ సారథ్యంలో ఆడిన గిల్.. ఐపీఎల్లో తొలిసారిగా నాయకత్వం వహించనున్నాడు. -
వచ్చే ఏడాది శ్రీలంకకు టీమ్ఇండియా
సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంక క్రికెట్ (ఎస్ఎల్సీ)కు శుభవార్త. వచ్చే ఏడాది జులై- ఆగస్టులో శ్రీలంకలో భారత జట్టు పర్యటించనుంది. ఈ పర్యటనలో మూడేసి వన్డేలు.. టీ20ల్లో భారత్, శ్రీలంక తలపడతాయని 2024 వార్షిక క్యాలెండర్లో ఎస్ఎల్సీ పేర్కొంది. వచ్చే ఏడాది శ్రీలంక 52 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడనుంది. -
Bumrah: బుమ్రా పోస్టు వెనుక బాధకు కారణమదేనేమో: క్రిష్ శ్రీకాంత్
ముంబయి ఇండియన్స్ (MI) జట్టులో ఏం జరుగుతుందనేది అభిమానుల్లో ఉత్కంఠగా మారింది. బుమ్రా పెట్టిన పోస్టుపై జట్టునే ఒక కుటుంబంగా భావించే మేనేజ్మెంట్ ఎలా స్పందిస్తుందో అందరిలోనూ మెదిలే ప్రశ్న. -
విలియమ్సన్ సెంచరీ
బంగ్లాదేశ్, న్యూజిలాండ్ మధ్య తొలి టెస్టు నువ్వానేనా అన్నట్టుగా సాగుతోంది. ఆతిథ్య బంగ్లాదేశ్‌ను తక్కువ స్కోరుకే ఆలౌట్ చేసిన కివీస్‌కు.. బ్యాటుతో ఇబ్బందులు తప్పలేదు. ఎడమచేతి వాటం స్పిన్నర్ తైజుల్ ఇస్లాం (4/89) సత్తా చాటడంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ 8 వికెట్లకు 266 పరుగులు సాధించింది.


తాజా వార్తలు (Latest News)
-
Modi: కుర్చీ పట్టుకోమ్మా..లేకపోతే ఆమె కూర్చుంటుంది..!: చమత్కరించిన మోదీ
-
JEE Main 2024: జేఈఈ మెయిన్‌కు దరఖాస్తు చేసేవారికి బిగ్ అప్డేట్
-
Jerusalem: జెరూసలెంలో ఉగ్రదాడి.. ముగ్గురు మృతి..!
-
holidays list: ఏపీలో వచ్చే ఏడాది 20 సాధారణ సెలవులు
-
Indian Navy: భారత నౌకాదళం చేతికి మూడు అత్యాధునిక నౌకలు..!
-
Stock market: స్వల్ప లాభాలతో ముగిసిన మార్కెట్లు