సమయం లేదు శ్రేయస్
ప్రపంచకప్ ముంగిట మిగిలింది రెండే మ్యాచ్‌లు. బ్యాటింగ్ ఆర్డర్లో కీలకమైన నాలుగో స్థానంలో ఆడబోతున్న శ్రేయస్ అయ్యర్ ఫిట్‌గానే ఉన్నాడా లేదా.. అతడి ఫామ్ సంగతేంటి..
భారత బ్యాటర్‌పై తీవ్ర ఒత్తిడి
ఆస్ట్రేలియాతో రెండో వన్డే నేడు
మధ్యాహ్నం 1.30 నుంచి
ఇందౌర్: ప్రపంచకప్ ముంగిట మిగిలింది రెండే మ్యాచ్‌లు. బ్యాటింగ్ ఆర్డర్లో కీలకమైన నాలుగో స్థానంలో ఆడబోతున్న శ్రేయస్ అయ్యర్ ఫిట్‌గానే ఉన్నాడా లేదా.. అతడి ఫామ్ సంగతేంటి.. ఈ ప్రశ్నలకు సమాధానాలు ఈ రెండు మ్యాచ్‌ల్లోనే తేలిపోవాలి. ఆస్ట్రేలియాతో తొలి వన్డేలో ఫిట్‌నెస్, ఫామ్ చాటుకునేందుకు మంచి అవకాశం లభించినా.. లేని పరుగుకు ప్రయత్నించి రనౌటైపోయాడు ఈ యువ బ్యాటర్. ఇప్పుడిక రెండో వన్డేకు రంగం సిద్ధమైంది. ఆదివారం నాటి ఈ మ్యాచ్‌లో అయినా శ్రేయస్ ఓ మంచి ఇన్నింగ్స్ ఆడాలని అభిమానులు కోరుకుంటున్నారు. శ్రేయస్ లాగే పెద్ద గాయంతో నెలల తరబడి ఆటకు దూరంగా ఉండి.. ఆసియా కప్‌తో పునరాగమనం చేసిన కేఎల్ రాహుల్ ఫిట్‌నెస్‌తో పాటు ఫామ్‌నూ చాటుకుని జట్టుకు భరోసానిస్తున్నాడు. అలాగే శ్రేయస్ కూడా ఊపందుకున్నాడంటే ప్రపంచకప్ ముంగిట భారత్‌కు పెద్ద భారం దిగిపోయినట్లే.
అతడికి తోడు అశ్విన్: అక్షర్ పటేల్ గాయం నేపథ్యంలో అనుకోకుండా జట్టులోకి వచ్చిన సీనియర్ ఆఫ్‌స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. తొలి వన్డేలో ఓ మోస్తరు ప్రదర్శన చేశాడు. 10 ఓవర్లలో 47 పరుగులిచ్చి ఒక వికెట్ తీశాడు. ప్రపంచకప్‌లో అవకాశం దక్కించుకోవాలంటే అశ్విన్ ఇంకా మెరుగైన ప్రదర్శన చేయాల్సిందే. రెండో వన్డేలో శ్రేయస్, అశ్విన్‌లిద్దరిపై అందరి దృష్టి నిలిచి ఉంటుందనడంలో సందేహం లేదు. కెప్టెన్ రోహిత్‌తో పాటు కోహ్లి, హార్దిక్, కుల్‌దీప్ లాంటి కీలక ఆటగాళ్లు లేకుండానే తొలి మ్యాచ్‌లో భారత్ బౌలింగ్, బ్యాటింగ్‌లో ఆధిపత్యంతో ఆసీస్‌పై సునాయాస విజయం సాధించింది. సీనియర్ పేసర్ షమి చాన్నాళ్ల తర్వాత పతాక స్థాయి బౌలింగ్‌తో సత్తా చాటడం పెద్ద సానుకూలాంశం. మిగతా బౌలర్లూ ఆకట్టుకున్నారు కానీ.. శార్దూల్ ఠాకూర్ మాత్రం ధారాళంగా పరుగులిచ్చేశాడు. వికెట్ కూడా పడగొట్టలేకపోయాడు. అతను గాడిన పడకుంటే కష్టం. బ్యాటింగ్‌లో శ్రేయస్ మినహా బ్యాటర్లు మంచి లయతో కనిపిస్తున్నారు. శుభ్‌మన్, రాహుల్ ఫామ్‌ను కొనసాగించగా.. అనుకోకుండా అవకాశం దక్కించుకున్న రుతురాజ్ సైతం అదరగొట్టాడు. అతను ఆసియా కప్‌లో జట్టును నడిపించాల్సిన నేపథ్యంలో రెండో వన్డేకు తన స్థానంలో తిలక్ వర్మను ఆడిస్తారేమో చూడాలి.
ఆసీస్ ఏం చేస్తుందో..: ఆస్ట్రేలియా తొలి వన్డే ఓటమి తర్వాత కసితో రగిలిపోతూ ఉంటుందనడంలో సందేహం లేదు. దాదాపుగా పూర్తి స్థాయి జట్టుతోనే బరిలోకి దిగిన కంగారూలకు.. కీలక ఆటగాళ్లు లేని భారత్ చేతిలో ఓడిపోవడమంటే పరాభవం కిందే లెక్క. పేసర్లకు అనుకూలించే మొహాలి పిచ్‌ను ఆ జట్టు పెద్దగా ఉపయోగించుకోలేకపోయింది. ఇక స్పిన్‌కు సహకరించే ఇందౌర్‌లో ఆసీస్ ఏం చేస్తుందో చూడాలి. స్మిత్, వార్నర్, మిచెల్ మార్ష్ లాంటి సీనియర్ల నుంచి జట్టు భారీ ఇన్నింగ్స్‌లు ఆశిస్తోంది. బౌలింగ్‌లో జంపా నుంచి భారత బ్యాటర్లకు ముప్పు తప్పదు. హేజిల్‌వుడ్ అందుబాటులోకి రానుండటంతో ఆసీస్ పేస్ బలం పెరగొచ్చు. ఇందౌర్ పిచ్ బ్యాటింగ్‌కు కూడా అనుకూలం కాబట్టి భారీ స్కోర్లు నమోదు కావచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Ravichandran Ashwin: ఆ రోజు కోహ్లి, రోహిత్ ఏడ్చారు
ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిన తర్వాత విరాట్ కోహ్లి, రోహిత్‌శర్మ డ్రెస్సింగ్‌రూమ్‌లో ఏడ్చారని ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ చెప్పాడు. -
Team India: బౌలర్లు పుంజుకునేనా!
పొట్టి సిరీస్ గెలవాలనే పట్టుదలతో ఉన్న భారత్ కీలక సమరానికి సిద్ధమైంది. శుక్రవారం జరిగే నాలుగో టీ20లో ఆస్ట్రేలియాతో తలపడుతుంది. తొలి రెండు టీ20ల్లో భారత్ నెగ్గగా.. మూడో మ్యాచ్‌లో నెగ్గడం ద్వారా సిరీస్ ఆశలను ఆసీస్ సజీవంగా ఉంచుకుంది. -
రోహిత్ పరిస్థితేంటి!
నిరుడు టీ20 ప్రపంచకప్ తర్వాతి నుంచి టీ20లకు దూరంగా ఉంటోన్న రోహిత్ శర్మ దక్షిణాఫ్రికా పర్యటనలోనూ పరిమిత ఓవర్ల క్రికెట్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. -
దక్షిణాఫ్రికాకు ముగ్గురి సారథ్యంలో..
దక్షిణాఫ్రికా పర్యటనకు టీమ్ఇండియా సిద్ధం. అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ మూడు ఫార్మాట్లకు జట్లను ప్రకటించింది. టీ20ల్లో సూర్యకుమార్, వన్డేల్లో కేఎల్ రాహుల్ భారత్‌కు నాయకత్వం వహించనున్నారు. -
టీ20 ప్రపంచకప్‌కు ఉగాండా
ఉగాండా..! క్రికెట్లో ఈ పేరు అసలు ఎప్పుడూ వినిపించదు. పెద్ద టోర్నీల్లో ఆ జట్టు ఎప్పుడూ ఆడలేదు. కానీ ఇప్పుడా జట్టు మెగా టోర్నీలో అదృష్టం పరీక్షించుకోనుంది. పెద్ద జట్లతో పోటీకి సై అంటోంది. -
భారత్‌కు 8 పతకాలు ఖాయం
ఐబీఏ ప్రపంచ జూనియర్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్లు అదిరే ప్రదర్శన చేశారు. ఆర్మేనియాలో జరుగుతున్న ఈ టోర్నీలో సెమీఫైనల్లో అడుగుపెట్టడం ద్వారా ఎనిమిది మంది పతకాలు ఖాయం చేసుకున్నారు. -
క్వార్టర్స్‌లో ప్రియాన్షు
సయ్యద్ మోదీ అంతర్జా తీయ బ్యాడ్మింటన్ టోర్నీలో ప్రియాన్షు రజావత్ క్వార్టర్ఫైనల్లో అడుగుపెట్టాడు. గురువారం పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో ప్రియాన్షు 21-18, 11-6 (రిటైర్డ్)తో సతీశ్ కుమార్‌పై విజయం సాధించాడు. -
నజ్ముల్ అజేయ శతకం
కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ శాంటో (104 బ్యాటింగ్; 193 బంతుల్లో 10×4) అజేయ శతకంతో సత్తాచాటడంతో న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో బంగ్లాదేశ్ పుంజుకుంది. -
స్టోక్స్ మోకాలికి శస్త్ర చికిత్స
ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ మోకాలికి విజయవంతంగా శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. వచ్చే ఏడాది జనవరిలో భారత్‌తో ఆరంభమయ్యే టెస్టు సిరీస్‌కు సిద్ధం కావాలనే పట్టుదలతో ఉన్న ఈ 32 ఏళ్ల ఆల్‌రౌండర్.. తాజాగా వన్డే ప్రపంచకప్‌లో బ్యాటర్‌గా మాత్రమే ఆడాడు. -
తెలంగాణకు రజతం
సీనియర్ జాతీయ ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ జట్టు రజత పతకం సాధించింది. మహిళల కాంపౌండ్ టీమ్ విభాగంలో తెలంగాణ ద్వితీయ స్థానంలో నిలిచింది.