సౌరాష్ట్ర 212/9

ఇరానీ కప్‌ మ్యాచ్‌పై రెస్టాఫ్‌ ఇండియా పట్టుబిగిస్తోంది.

Published : 03 Oct 2023 02:54 IST

రాజ్‌కోట్‌: ఇరానీ కప్‌ మ్యాచ్‌పై రెస్టాఫ్‌ ఇండియా పట్టుబిగిస్తోంది. విద్వత్‌ కవేరప్ప (3/28), సౌరభ్‌ కుమార్‌ (3/64), శామ్స్‌ ములాని (2/46) విజృంభించడంతో రెండో రోజు, సోమవారం ఆట ముగిసే సమయానికి సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. అర్పిత్‌ (54) టాప్‌స్కోరర్‌. అంతకుముందు రెస్ట్‌ 308 పరుగులకు ఆలౌటైంది.


డబ్బుల్లేక మిక్చర్‌ అమ్మేవాడిని

హారిస్‌ రవూఫ్‌! ఇప్పుడంటే ఈ పాకిస్థాన్‌ పేసర్‌ పెద్ద స్టార్‌. ఒకప్పుడు చదువు కోసం ఫీజు కట్టడానికి డబ్బుల్లేక మార్కెట్లో మిక్చర్‌ అమ్మేవాడు. ఈ విషయాన్ని అతడే చెప్పాడు. ‘‘ఇంటర్‌ తర్వాత డిగ్రీలో చేరడానికి మా ఇంట్లో పరిస్థితులు అనుకూలంగా లేవు. అందుకే ఆదివారం మార్కెట్లో మిక్చర్‌ అమ్మేవాడిని. క్రికెట్‌ మ్యాచ్‌లు ఆడి వచ్చిన డబ్బులతో ఫీజులను కట్టుకునే వాడిని. నా సంపాదన మొత్తం అమ్మకు ఇచ్చేవాడిని. నాన్నకు మాత్రం తెలియనిచ్చేవాడిని కాదు. మా నాన్నకు ముగ్గురు సోదరులు. అంతా కలిసే ఉండేవాళ్లం. వాళ్లకు పెళ్లిళ్లు అయ్యాక స్థలం లేక వంట గదిలో పడుకునేవాడిని’’ అని రవూఫ్‌ గుర్తు చేసుకున్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు