ODI WC 2023: ట్రోఫీకి.. భారత్‌కు మధ్య!
భారీ అంచనాల మధ్య వన్డే ప్రపంచకప్ బరిలో దిగుతోంది టీమ్‌ఇండియా. 1983లో కపిల్ డెవిల్స్, 2011లో ధోనీసేనతరహాలోనే రోహిత్ బృందం కూడా అద్భుత ఆటతీరుతో కప్పు పట్టేస్తుందని అభిమానులు బోలెడు ఆశలతో ఉన్నారు.
ఈనాడు క్రీడావిభాగం
భారీ అంచనాల మధ్య వన్డే ప్రపంచకప్ బరిలో దిగుతోంది టీమ్‌ఇండియా. 1983లో కపిల్ డెవిల్స్, 2011లో ధోనీసేన తరహాలోనే రోహిత్ బృందం కూడా అద్భుత ఆటతీరుతో కప్పు పట్టేస్తుందని అభిమానులు బోలెడు ఆశలతో ఉన్నారు. చూడ్డానికి మన జట్టు బలంగానే కనిపిస్తోంది. ఇటీవలి ఫామ్ కూడా బాగుంది. కానీ కప్పు దారిలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించడం రోహిత్‌సేనకు అంత తేలికేమీ కాదు. కప్పుకి,భారత్‌కు మధ్య కొన్ని జట్లు పెద్ద అడ్డంకులుగా నిలవడం ఖాయం.
ఆల్‌రౌండ్ బలంతో..
ప్రపంచకప్ వస్తుంటే న్యూజిలాండ్ మీద మరీ అంచనాలేమీ ఉండవు. ఆ జట్టు కూడా అంతగా హడావుడి చేయదు. కానీ టోర్నీలో నిలకడగా ఆడి ముందంజ వేస్తుంటుంది. ఫేవరెట్ జట్లకు చెక్ పెడుతుంటుంది. తొలి ప్రపంచకప్ కోసం ఆ జట్టు కొన్ని పర్యాయాల నుంచి గట్టిగా ప్రయత్నిస్తోంది. గత రెండు టోర్నీల్లోనూ కివీసే రన్నరప్. 2019లో టైటిల్‌కు అత్యంత చేరువగా వచ్చిన ఆ జట్టును దురదృష్టం వెంటాడింది. సూపర్‌ఓవర్లోనూ స్కోర్లు సమమైన మ్యాచ్‌లో ఇంగ్లాండ్ ఎక్కువ బౌండరీల ఆధారంగా విజేతగా నిలిచింది. ఈసారి బలమైన జట్టుతో బరిలోకి దిగుతున్న కివీస్.. అన్ని అడ్డంకులనూ దాటి కప్పు గెలవాలనుకుంటోంది. గాయం నుంచి కోలుకుని కెప్టెన్ విలియమ్సన్ అందుబాటులోకి రావడం ఆ జట్టుకు ఉపశమనం. డరైల్ మిచెల్, జిమ్మీ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర.. ఇలా మరే జట్టుకూ లేనంతమంది ఆల్‌రౌండర్లు కివీస్ సొంతం. కాన్వే, యంగ్, లేథమ్, నికోల్స్ లాంటి నాణ్యమైన స్పెషలిస్టు బ్యాటర్లూ ఉన్నారు. బౌల్ట్, సౌథీ, జేమీసన్‌లతో పేస్ బలం.. సోధి, రచిన్‌లతో భారత పిచ్‌లకు తగ్గ స్పిన్ బలమూ ఉంది. ఈ ఆల్‌రౌండ్ జట్టును దాటి కప్పు గెలవాలంటే భారత్ కష్టపడాల్సిందే.
కప్పు అంటే చాలు..
ప్రపంచకప్ ముంగిట చివరగా ఆడిన సిరీస్‌లో ఆస్ట్రేలియాను సులువుగా ఓడించేసింది భారత్. అంతమాత్రాన కంగారూలను తక్కువగా అంచనా వేస్తే కష్టమే. ప్రపంచకప్ లాంటి మెగా టోర్నీల్లో ఎలా ఆడాలో ఆస్ట్రేలియాకు తెలిసినట్లు మరే జట్టుకూ తెలియదంటే అతిశయోక్తి కాదు. అందుకే ఆ జట్టు అయిదు టైటిళ్లు గెలవగలిగింది. తరాలు మారినా.. ఆటగాళ్లు మారినా ఆస్ట్రేలియా ప్రపంచకప్‌లో ఎప్పుడూ ఫేవరెట్టే. కెప్టెన్ కమిన్స్‌తో పాటు స్మిత్, స్టార్క్, మ్యాక్స్‌వెల్ లాంటి కీలక ఆటగాళ్లు ఫిట్‌నెస్ సమస్యలను అధిగమించి ప్రపంచకప్‌కు అందుబాటులోకి రావడంతో ఆ జట్టు బలం పెరిగింది. వార్నర్, మిచెల్ మార్ష్, హెడ్, లబుషేన్, స్టాయినిస్, జంపా మంచి ఫామ్‌లో ఉన్నారు. అన్ని విభాగాల్లో బలంగా కనిపిస్తున్న ఆసీస్‌ను లీగ్ మ్యాచ్‌లో భారత్ ఎలా ఎదుర్కొంటుందో చూడాలి. నాకౌట్‌లో ఆ జట్టు ఎదురైనా ఓడించడం అంత తేలిక కాదు.
భయపెట్టే దూకుడు
కప్పు జరుగుతోంది భారత్‌లో అయినా.. మన జట్టును కాదని దిగ్గజ ఆటగాడు గావస్కర్ ఇంగ్లాండ్‌ను టైటిల్ ఫేవరెట్‌గా పేర్కొన్నాడంటే ఆ జట్టు ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కొన్నేళ్లుగా ఇంగ్లాండ్ ఆటతీరును చూస్తున్న వాళ్లకు సన్నీ అంచనా అతిగా ఏమీ అనిపించదు. టెస్టుల్లో అనుసరిస్తున్న ‘బజ్‌బాల్’ వ్యూహాన్ని వన్డేల్లో చాలా ఏళ్ల నుంచే అమలు చేస్తోంది ఆ జట్టు. 2015 వన్డే ప్రపంచకప్ వైఫల్యం తర్వాత వన్డేలు ఆడే తీరునే మార్చేసిందా జట్టు. ఆచితూచి ఆడే ఆటగాళ్లందరినీ పక్కన పెట్టి విధ్వంసక ఆటగాళ్లతో జట్టును నింపేసింది. నెమ్మదిగా ఆడే రూట్ సైతం తన ఆటతీరును మార్చుకోవాల్సి వచ్చింది. 8, 9 స్థానాల్లో కూడా బ్యాటింగ్ చేసే ఆటగాళ్లుండటంతో క్రీజులో అడుగు పెట్టిన దగ్గర్నుంచి ప్రతి బ్యాటర్ బాదడమే పనిగా పెట్టుకుంటున్నాడు. నాకౌట్‌లో ఇంగ్లిష్ జట్టు ఎదురై, వాళ్ల సహజశైలిలో రెచ్చిపోతే భారత్ పరిస్థితి ఏంటన్నది ప్రశ్న. నిరుడు టీ20 ప్రపంచకప్ సెమీస్‌లో పది వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ మిగిల్చిన పరాభవాన్ని టీమ్‌ఇండియా మరిచిపోయి ఉండదు. ఇంగ్లాండ్‌కు మరో జట్టయినా అడ్డుకట్ట వేయాలి. లేదా నాకౌట్లో ఆ జట్టు ఎదురైతే రోహిత్ సేన పక్కా ప్రణాళికతో దెబ్బ కొట్టాలి. లేదంటే కప్పుపై ఆశలు వదులుకోవాల్సిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
IND vs SA: సఫారీలతో టీ20 సిరీస్.. గత రికార్డులు ఎలా ఉన్నాయంటే?
డిసెంబరు 10 నుంచి దక్షిణాఫ్రికా, భారత్ (SA vs IND) మధ్య మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్ ప్రారంభంకానుంది. -
WPL 2024 Auction: మల్లికా సాగర్.. డబ్ల్యూపీఎల్ వేలం నిర్వహణదారు ప్రత్యేకతలివే..
డబ్ల్యూపీఎల్ వేలం (WPL 2024 Auction) నిర్వహణకు ప్లేయర్ల జాబితా, ఫ్రాంచైజీలు సిద్ధం. ఇలాంటి కీలకమైన కార్యక్రమం నిర్వహించాలంటే ఆక్షనీర్ కూడా యాక్టివ్‌గా ఉండటంతోపాటు ప్లేయర్లపై అవగాహన ఉండాలి. మరి ఈ వేలం కార్యక్రమాన్ని నిర్వహించబోయే మల్లికా సాగర్ గురించి తెలుసుకుందాం.. -
Gautham Gambhir: మా ఆటగాళ్లను రక్షించుకోవాల్సిన బాధ్యత నాదే : గంభీర్
ముక్కుసూటిగా మాట్లాడుతూ.. అవతలి వారు ఎవరైనా సరే దూకుడుగా వ్యవహరించే స్వభావం గౌతమ్ గంభీర్‌ది (Gautam Gambhir). సహచరులైనా.. ప్రత్యర్థులైనా ఒకేలా స్పందిస్తూ ఉంటాడు. -
World cup 2024: పొట్టి కప్పులో విరాట్ ఆడడా?
ఇటీవల వన్డే ప్రపంచకప్‌లో అదరగొట్టిన కోహ్లి.. వచ్చే ఏడాది పొట్టి ప్రపంచకప్ ఆడటంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. -
AB de Villiers: అందుకే త్వరగా ఆటకు వీడ్కోలు పలికా: ఏబీడీ
మైదానంలో అన్ని వైపులా ఎడాపెడా షాట్లు బాదే ఏబీ డివిలియర్స్‌కు 360 డిగ్రీల ఆటగాడని పేరు. భీకర ఫామ్‌లో ఉన్నప్పుడే అకస్మాత్తుగా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికి ఆశ్చర్యపరిచాడీ దక్షిణాఫ్రికా స్టార్. -
IND vs SA: సఫారీ సవాలుకు సై
ఇంగ్లాండ్‌ను ఇంగ్లాండ్‌లో ఓడించింది.. న్యూజిలాండ్‌ను ఆ దేశంలోనే మట్టికరిపించింది.. ఆస్ట్రేలియా గడ్డపై విజయకేతనం ఎగరేసింది. -
WPL 2024: డబ్ల్యూపీల్ను వేదికగా చేసుకుని..
మహిళల ప్రిమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో రాణించి తిరిగి భారత జట్టు తలుపు తట్టాలని భావిస్తున్నట్లు వేద కృష్ణమూర్తి తెలిపింది. -
Pro Kabaddi League: మెరిసిన మోహిత్
ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్లో పుణెరి పల్టాన్ వరుసగా రెండో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. మోహిత్ గోయత్ (12 పాయింట్లు) ఆల్‌రౌండ్ ప్రదర్శనతో సత్తాచాటడంతో శుక్రవారం పుణెరి జట్టు 43- 32 తేడాతో యు ముంబాను చిత్తుచేసింది. -
David Warner: ఎవరి అభిప్రాయాలు వాళ్లవి
ఎవరి అభిప్రాయాలు వాళ్లకుంటాయని, ముందుకు సాగడమే తన పని అని ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ అన్నాడు. -
IND w Vs ENG w: ఇంగ్లాండ్ జోరును భారత్ ఆపేనా!
ఇంగ్లాండ్ మహిళల జట్టుతో మూడు టీ20ల సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో ఓడిన భారత్‌కు పరీక్ష. సిరీస్‌లో ఆశలు నిలవాలంటే శనివారం రెండో టీ20లో హర్మన్‌ప్రీత్ బృందం గెలవక తప్పదు. తొలి మ్యాచ్‌లో విజయం ఇచ్చిన ఉత్సాహంతో ఉన్న ఇంగ్లాండ్‌కు అడ్డుకట్ట వేయడం టీమ్ఇండియాకు అంత తేలికేం కాదు. -
BAN vs NZ: ఆదుకున్న ఫిలిప్స్
గ్లెన్ ఫిలిప్స్ (87; 72 బంతుల్లో 9×4, 4×6) ఆదుకోవడంతో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో న్యూజిలాండ్ స్వల్ప ఆధిక్యం సంపాదించింది. -
ODI WC 2023: అహ్మదాబాద్ పిచ్ ‘సాధారణం’
భారత్, ఆస్ట్రేలియా మధ్య ప్రపంచకప్ ఫైనల్‌కు ఆతిథ్యమిచ్చిన అహ్మదాబాద్ వికెట్‌ను ‘సాధారణ పిచ్’గా ఐసీసీ పేర్కొంది. -
మళ్లీ పంజాబ్ గూటికి బంగర్
టీమ్‌ఇండియా మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ మళ్లీ పంజాబ్స్ కింగ్స్ జట్టులో చేరాడు. వచ్చే సీజన్ కోసం పంజాబ్ డైరెక్టర్ (క్రికెట్ డెవలప్మెంట్)గా బంగర్ నియమితుడయ్యాడు. -
అర్షిన్ ఆల్‌రౌండ్ జోరు
అర్షిన్ కులకర్ణి (70 నాటౌట్; 3/29) ఆల్‌రౌండ్ జోరు ప్రదర్శించడంతో అండర్-19 ఆసియాకప్ టోర్నీలో భారత్ శుభారంభం చేసింది. -
WPL 2024: ఎవరి పంట పండేనో..?
వచ్చే ఏడాది మహిళల ప్రిమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) రెండో సీజన్ నేపథ్యంలో శనివారం మినీ వేలం నిర్వహించనున్నారు. 2023లోనే డబ్ల్యూపీఎల్ ఆరంభమైన సంగతి తెలిసిందే.


తాజా వార్తలు (Latest News)
-
TS News: ఆరు గ్యారంటీల్లో 2 పథకాలను ప్రారంభించిన సీఎం రేవంత్
-
IND vs SA: సఫారీలతో టీ20 సిరీస్.. గత రికార్డులు ఎలా ఉన్నాయంటే?
-
Swiggy - Zomato: స్విగ్గీ, జొమాటోతోనే మాకు పోటీ: ఎడిల్విస్ సీఈఓ
-
BRS: ఎమ్మెల్సీలుగా పల్లా, కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి రాజీనామా
-
వారి అంకితభావానికి ఆశ్చర్యపోయా.. టాలీవుడ్ ప్రముఖులపై నెట్‌ఫ్లిక్స్ కో-సీఈవో పోస్టు
-
Telangana Assembly: అసెంబ్లీ సమావేశాలు వాయిదా.. స్పీకర్ ఎన్నిక అప్పుడే