Kapil Dev: మిమ్మల్ని చూసి భారత్‌ గర్విస్తోంది.. తల ఎత్తుకోండి..

ప్రపంచకప్‌లో రన్నరప్‌గా నిలిచిన రోహిత్‌సేనపై దిగ్గజ ఆటగాడు కపిల్‌ దేవ్‌ ప్రశంసల జల్లు కురిపించాడు.

Updated : 21 Nov 2023 07:43 IST

దిల్లీ: ప్రపంచకప్‌లో రన్నరప్‌గా నిలిచిన రోహిత్‌సేనపై దిగ్గజ ఆటగాడు కపిల్‌ దేవ్‌ ప్రశంసల జల్లు కురిపించాడు. భారత జట్టు ప్రదర్శన పట్ల దేశం గర్విస్తోందని 1983 ప్రపంచకప్‌ విజేత జట్టు కెప్టెన్‌ కపిల్‌ తెలిపాడు. ‘‘ఛాంపియన్స్‌లా ఆడారు. సగర్వంగా తల ఎత్తుకోండి. మీ మెదడులో ట్రోఫీ తప్ప మరో ఆలోచన లేదు. మీరెప్పుడో విజేతలుగా నిలిచారు. మిమ్మల్ని చూసి భారత్‌ గర్విస్తోంది. రోహిత్‌.. నీ పనిలో మాస్టర్‌ నువ్వు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు నీకోసం ఎదురు చూస్తున్నాయి. ఇది కష్టకాలమని నాకు తెలుసు. కానీ స్ఫూర్తిని కోల్పోవద్దు. భారత్‌ నీకు మద్దతుగా ఉంది’’ అని కపిల్‌ పేర్కొన్నాడు.


వీక్షణలో కొత్త రికార్డు

దిల్లీ: ప్రపంచకప్‌ ఆరంభం అయిన నాటి నుంచి ఈ టోర్నీలో మ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్న డిజిటల్‌ వేదిక డిస్నీ హాట్‌స్టార్‌ వీక్షణలో రికార్డులు సృష్టిస్తూనే ఉంది. భారత్‌-ఆస్ట్రేలియా మధ్య ప్రపంచకప్‌ ఫైనల్‌ను ఈ వేదికలో 5.9 కోట్ల మంది వీక్షించారు. దీంతో భారత్‌-న్యూజిలాండ్‌ సెమీఫైనల్‌ మ్యాచ్‌ రికార్డు (5.3 కోట్లు) చెరిగిపోయింది. టీమ్‌ఇండియా ఆడిన మ్యాచ్‌ల్లో ఎప్పటికప్పుడు కొత్త రికార్డులు నమోదయ్యాయి. లీగ్‌ దశలో భారత్‌-కివీస్‌ మ్యాచ్‌ను 4.3 కోట్లు, భారత్‌-దక్షిణాఫ్రికా పోరును 4.4 కోట్ల మంది అభిమానులు వీక్షించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు