Icc World Cup 2023: ఐసీసీ ప్రపంచకప్‌ జట్టు కెప్టెన్‌గా రోహిత్‌

టీమ్‌ఇండియా సారథి రోహిత్‌ శర్మ.. ఐసీసీ ప్రపంచకప్‌ జట్టు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.

Updated : 21 Nov 2023 04:05 IST

దుబాయ్‌: టీమ్‌ఇండియా సారథి రోహిత్‌ శర్మ.. ఐసీసీ ప్రపంచకప్‌ జట్టు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ప్రపంచకప్‌లో ఆటగాళ్ల ప్రదర్శన ఆధారంగా ఐసీసీ 11 మందితో కూడిన జట్టును ప్రకటించింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నీ’ విరాట్‌ కోహ్లి సహా ఆరుగురు భారత ఆటగాళ్లు ఈ జట్టులో ఉన్నారు. టోర్నీలో దూకుడైన బ్యాటింగ్‌తో రోహిత్‌ జట్టును ముందుండి నడిపించాడు. ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లతో జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. కోహ్లి.. టోర్నీ టాప్‌స్కోరర్‌గా, ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచిన సంగతి తెలిసిందే. కేఎల్‌ రాహుల్‌, రవీంద్ర జడేజా, జస్‌ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ షమి.. ఐసీసీ జట్టులో స్థానం దక్కించుకున్న ఇతర భారత ఆటగాళ్లు. టోర్నీ విజేత ఆస్ట్రేలియా నుంచి మ్యాక్స్‌వెల్‌, అడమ్‌ జంపాలకు స్థానం లభించింది.

ఐసీసీ టీమ్‌ ఆఫ్‌ ద టోర్నీ: రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), క్వింటన్‌ డికాక్‌, విరాట్‌ కోహ్లి, డరిల్‌ మిచెల్‌, కేఎల్‌ రాహుల్‌ (వికెట్‌కీపర్‌), గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌, రవీంద్ర జడేజా, బుమ్రా, మహ్మద్‌ షమి, ఆడమ్‌ జంపా, దిల్షాన్‌ మదుశంక, గెరాల్డ్‌ కొయెట్జీ (12వ ఆటగాడు)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని