Rohit Sharma: నా జీవితంలో పల్లాలే ఎక్కువ

జీవితంలో ఎత్తుల కంటే పల్లాలే ఎక్కువ చూశానని టీమ్‌ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అన్నాడు.

Updated : 16 May 2024 06:59 IST

దిల్లీ: జీవితంలో ఎత్తుల కంటే పల్లాలే ఎక్కువ చూశానని టీమ్‌ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అన్నాడు. ఇంకొన్నేళ్లు క్రికెట్లో కొనసాగాలనుకుంటున్నానని చెప్పాడు. ‘‘క్రికెటర్‌గా నా ప్రయాణం అద్భుతం. భారత్‌ లాంటి దేశంలో జాతీయ జట్టుకు ఆడడం అంత తేలిక కాదు. నేను 17 ఏళ్లుగా ఆడుతున్నా. ఇంకొన్నేళ్లు ఆడాలనుకుంటున్నా’’ అని ఓ రేడియో ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రోహిత్‌ అన్నాడు. ‘‘నా జీవితంలో ఎత్తులకంటే పల్లాలనే ఎక్కువగా చూశా. నా గత అనుభవాల వల్లే ఇప్పుడు నేను ఈ స్థితిలో ఉన్నా. కెరీర్‌ ఆరంభించిన కొత్తలో సానుకూలాంశాలేమీ లేవు. జట్టుపై అంతగా సానుకూల మద్రను వేయలేకపోయా. నేను అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్‌ ఆడేందుకు అర్హుడినేనా అని అనుకున్నా’’ అని చెప్పాడు. తాను కెప్టెనవుతానని ఎప్పుడూ అనుకోలేదని, దేశానికి నాయకత్వం వహించడం గొప్ప గౌరవమని రోహిత్‌ అన్నాడు. ‘‘నేను జట్టుకు నాయకత్వం వహించే రోజు వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. కానీ మంచి వాళ్లకు మంచే జరుగుతుందని జనం అంటుంటారు కదా’’ అని చెప్పాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని