అర్జున్‌ @ 4

అంతర్జాతీయ చెస్‌లో సత్తా చాటుతున్న తెలంగాణ గ్రాండ్‌మాస్టర్‌ అర్జున్‌ ఇరిగేశి ర్యాంకింగ్‌లోనూ దూసుకెళ్తున్నాడు. తాజాగా ప్రకటించిన ఫిడే లైవ్‌ రేటింగ్‌ జాబితాలో అర్జున్‌ (2773.9) 4వ స్థానంలో నిలిచాడు. భారత్‌ నుంచి టాప్‌-5లో అర్జున్‌ మాత్రమే చోటు దక్కించుకున్నాడు.

Published : 12 Jun 2024 04:13 IST

దిల్లీ: అంతర్జాతీయ చెస్‌లో సత్తా చాటుతున్న తెలంగాణ గ్రాండ్‌మాస్టర్‌ అర్జున్‌ ఇరిగేశి ర్యాంకింగ్‌లోనూ దూసుకెళ్తున్నాడు. తాజాగా ప్రకటించిన ఫిడే లైవ్‌ రేటింగ్‌ జాబితాలో అర్జున్‌ (2773.9) 4వ స్థానంలో నిలిచాడు. భారత్‌ నుంచి టాప్‌-5లో అర్జున్‌ మాత్రమే చోటు దక్కించుకున్నాడు. దొమ్మరాజు గుకేశ్‌ (2763.3), ప్రజ్ఞానంద (2757.0) ఏడు.. ఎనిమిదో ర్యాంకుల్లో ఉన్నారు. మాగ్నస్‌ కార్ల్‌సన్‌ (2831.8, నార్వే) అగ్రస్థానంలో ఉండగా.. నకముర (2801.6, అమెరికా), ఫాబియానో కరూనా (2795.6) తర్వాతి స్థానాలు దక్కించుకున్నారు. ‘‘ర్యాంకుల్లో మెరుగవడానికి చాలా కష్టపడ్డా. స్నేహితులతో సహా అందరికి దూరంగా ఉండి ఆటపైనే దృష్టి పెట్టా. ఓడినా కూడా ఆ ప్రభావం తర్వాతి గేమ్‌లపై పడకుండా ప్రయత్నిస్తున్నా. అందుకే సానుకూల ఫలితాలు వస్తున్నాయి’’ అని అర్జున్‌ చెప్పాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని