వింబుల్డన్‌కు నాదల్‌ దూరం

ఫిట్‌నెస్‌ లేకుండానే ఫ్రెంచ్‌ ఓపెన్‌లో దిగి తొలి రౌండ్లోనే వెనుదిరిగిన స్పెయిన్‌ దిగ్గజ ఆటగాడు రఫెల్‌ నాదల్‌.. వింబుల్డన్‌ నుంచి తప్పుకున్నాడు. జులై 1న ఆరంభమయ్యే ఈ టోర్నీలో ఆడట్లేదని.. ఒలింపిక్స్‌ కోసం సిద్ధం అవుతున్నట్లు రఫా వెల్లడించాడు.

Published : 14 Jun 2024 03:34 IST

లండన్‌: ఫిట్‌నెస్‌ లేకుండానే ఫ్రెంచ్‌ ఓపెన్‌లో దిగి తొలి రౌండ్లోనే వెనుదిరిగిన స్పెయిన్‌ దిగ్గజ ఆటగాడు రఫెల్‌ నాదల్‌.. వింబుల్డన్‌ నుంచి తప్పుకున్నాడు. జులై 1న ఆరంభమయ్యే ఈ టోర్నీలో ఆడట్లేదని.. ఒలింపిక్స్‌ కోసం సిద్ధం అవుతున్నట్లు రఫా వెల్లడించాడు. 22 గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్ల విజేత నాదల్‌.. జులై 26న పారిస్‌లో మొదలయ్యే ఒలింపిక్స్‌లో సింగిల్స్, డబుల్స్‌లో బరిలో దిగననున్నాడు. డబుల్స్‌లో అతడు కార్లోస్‌ అల్కరాస్‌తో కలిసి ఆడతాడు. 

వింబుల్డన్‌ ప్రైజ్‌మనీ రూ.533 కోట్లు: టెన్నిస్‌లో ప్రతిష్టాత్మక టోర్నీ వింబుల్డన్‌లో ప్రైజ్‌మనీ భారీగా పెరిగింది. ఇకపై ఈ గ్రాండ్‌స్లామ్‌కి రూ.533 కోట్లు నగదు బహుమతి కేటాయించినట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఈ మొత్తం గత టోర్నీతో పోలిస్తే 11.9 శాతం ఎక్కువ. విజేతకు ట్రోఫీతో పాటు రూ.28 కోట్లు.. రన్నరప్‌కు రూ.14 కోట్లు దక్కుతాయి. సింగిల్స్‌లో తొలి రౌండ్లో ఓడిన క్రీడాకారులకు రూ.64 లక్షల చొప్పున దక్కనున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని