క్వార్టర్స్‌లో ప్రణయ్, సమీర్‌

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ప్రపంచ టూర్‌ సూపర్‌ 500 టోర్నీలో భారత ఆటగాళ్లు హెచ్‌.ఎస్‌.ప్రణయ్, సమీర్‌వర్మ క్వార్టర్‌ఫైనల్లో అడుగుపెట్టారు. గురువారం పురుషుల సింగిల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో ప్రణయ్‌ 21-17, 21-15తో మిషా జిల్బర్‌మన్‌ (ఇజ్రాయెల్‌)పై, సమీర్‌ 21-14, 14-21, 21-19తో ఎనిమిదో సీడ్‌ లో కీన్‌ యూ (సింగపూర్‌)పై గెలిచారు.

Published : 14 Jun 2024 03:36 IST

సిడ్నీ: ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ప్రపంచ టూర్‌ సూపర్‌ 500 టోర్నీలో భారత ఆటగాళ్లు హెచ్‌.ఎస్‌.ప్రణయ్, సమీర్‌వర్మ క్వార్టర్‌ఫైనల్లో అడుగుపెట్టారు. గురువారం పురుషుల సింగిల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో ప్రణయ్‌ 21-17, 21-15తో మిషా జిల్బర్‌మన్‌ (ఇజ్రాయెల్‌)పై, సమీర్‌ 21-14, 14-21, 21-19తో ఎనిమిదో సీడ్‌ లో కీన్‌ యూ (సింగపూర్‌)పై గెలిచారు. కిరణ్‌ జార్జ్‌ 20-22, 6-21తో కెంటా నిషిమొటొ (జపాన్‌) చేతిలో పరాజయం చవిచూశాడు. మహిళల సింగిల్స్‌లో ఆకర్షి కశ్యప్‌ 21-16, 21-13తో కాయ్‌ తియో (ఆస్ట్రేలియా)పై నెగ్గి క్వార్టర్స్‌ చేరుకుంది. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సుమీత్‌రెడ్డి- సిక్కిరెడ్డి జోడీ 21-11, 21-11తో చెన్‌ తియో- కాయ్‌ తియో (ఆస్ట్రేలియా) జంటను చిత్తుచేసి క్వార్టర్స్‌ చేరుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని