ప్రపంచ జూనియర్‌ చెస్‌ విజేత దివ్య

భారత యువ చెస్‌ క్రీడాకారిణి దివ్య దేశ్‌ముఖ్‌ సత్తా చాటింది. ప్రపంచ జూనియర్‌ చెస్‌ టోర్నమెంట్లో మహిళల విభాగంలో ఆమె విజేతగా నిలిచింది. మొత్తం 11 రౌండ్లలో 10 పాయింట్లు సాధించిన దివ్య.. అగ్రస్థానంలో నిలిచింది.

Published : 14 Jun 2024 03:37 IST

గాంధీనగర్‌: భారత యువ చెస్‌ క్రీడాకారిణి దివ్య దేశ్‌ముఖ్‌ సత్తా చాటింది. ప్రపంచ జూనియర్‌ చెస్‌ టోర్నమెంట్లో మహిళల విభాగంలో ఆమె విజేతగా నిలిచింది. మొత్తం 11 రౌండ్లలో 10 పాయింట్లు సాధించిన దివ్య.. అగ్రస్థానంలో నిలిచింది. గురువారం ఆఖరి రౌండ్లో బెలోస్లావా (బల్గేరియా)ను ఆమె ఓడించింది. మరో భారత ప్లేయర్‌ రక్షిత రవి (7.5) అయిదో స్థానంతో సరిపెట్టుకుంది. చివరి రౌండ్లో మరియమ్‌ (ఆర్మేనియా) చేతిలో రక్షిత ఓడింది. మరియమ్‌ (9.5), అయాన్‌ (అజర్‌బైజాన్, 8.5) రెండు, మూడో స్థానాలు దక్కించుకున్నారు. ఓపెన్‌ విభాగంలో నోజెర్‌బెక్‌ (కజకిస్థాన్, 8.5 పాయింట్లు) టైటిల్‌ గెలిచాడు. ఆఖరి రౌండ్లో మమికోన్‌ (ఆర్మేనియా)పై అతడు విజయం సాధించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని