ఆ స్టేడియం ఇక కనిపించదు

నాసా కౌంటీ అంతర్జాతీయ స్టేడియం.. గత కొన్ని నెలలుగా చర్చంతా దీని గురించే. టీ20 ప్రపంచకప్‌ కోసం దాదాపు 100 రోజుల్లో ఈ స్టేడియాన్ని ఏర్పాటు చేయడం దగ్గర నుంచి ఇక్కడి ప్రమాదకర పిచ్‌లపై విమర్శల వరకూ దీని గురించే మాట్లాడుకున్నారు.

Published : 14 Jun 2024 03:40 IST

న్యూయార్క్‌: నాసా కౌంటీ అంతర్జాతీయ స్టేడియం.. గత కొన్ని నెలలుగా చర్చంతా దీని గురించే. టీ20 ప్రపంచకప్‌ కోసం దాదాపు 100 రోజుల్లో ఈ స్టేడియాన్ని ఏర్పాటు చేయడం దగ్గర నుంచి ఇక్కడి ప్రమాదకర పిచ్‌లపై విమర్శల వరకూ దీని గురించే మాట్లాడుకున్నారు. ఇక ఈ స్టేడియం కనిపించదు. అవును.. కేవలం ప్రపంచకప్‌ కోసం తాత్కాలిక స్టాండ్స్‌లతో రూపొందించిన ఈ స్టేడియాన్ని తొలగించనున్నారు. ఆ విడి భాగాలను గోల్ఫ్‌ టోర్నీ కోసం తిరిగి లాస్‌వేగాస్‌కు పంపించనున్నారు. నాసా కౌంటీ స్టేడియమున్న ఐసెన్‌హావర్‌ పార్క్‌ తిరిగి యథాతథంగా మారుతుంది. కానీ ప్రపంచ స్థాయి పిచ్‌లను మాత్రమే అలాగే ఉంచుతారు. అమెరికాతో భారత్‌ మ్యాచే ఇక్కడ చివరిది. అస్థిర బౌన్స్‌కు సహకరించిన ఈ మందకొడి పిచ్‌పై జరిగిన అన్ని మ్యాచ్‌ల్లోనూ తక్కువ స్కోర్లే నమోదయ్యాయి. ఈ స్టేడియంలో 8 ప్రపంచకప్‌ మ్యాచ్‌లు జరిగాయి. ఐర్లాండ్‌పై కెనడా చేసిన 137 పరుగులే అత్యధిక స్కోరు. అత్యల్పంగా దక్షిణాఫ్రికాపై శ్రీలంక 77 పరుగులకే కుప్పకూలింది. ఇక్కడ ఐర్లాండ్, పాకిస్థాన్, అమెరికాతో టీమ్‌ఇండియా మ్యాచ్‌లాడింది. భారత్‌ గ్రూప్‌ దశలో తన చివరి మ్యాచ్‌ను శనివారం కెనడాతో లాడర్‌హిల్‌లో ఆడుతుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని