సెమీస్‌లో నగాల్‌

భారత స్టార్‌ ఆటగాడు సుమిత్‌ నగాల్‌ పెరుగియా టెన్నిస్‌ ఛాలెంజర్‌ టోర్నీలో సెమీఫైనల్‌కు దూసుకెళ్లాడు.

Published : 15 Jun 2024 02:44 IST

పెరూగియా: భారత స్టార్‌ ఆటగాడు సుమిత్‌ నగాల్‌ పెరుగియా టెన్నిస్‌ ఛాలెంజర్‌ టోర్నీలో సెమీఫైనల్‌కు దూసుకెళ్లాడు. శుక్రవారం క్వార్టర్‌ఫైనల్లో నగాల్‌ 6-4 7-5తో మార్క్స్‌ కాస్‌నికౌస్కి (పోలెండ్‌)ను ఓడించాడు. సెమీస్‌లో జపాటా (స్పెయిన్‌)ను నగాల్‌ ఢీకొంటాడు. మరో క్వార్టర్స్‌లో జపాటా 6-3, 6-3తో లాస్లో జేర్‌ (సెర్బియా)ను ఓడించాడు. ఈ సీజన్లో మంచి ఫామ్‌లో ఉన్న నగాల్‌.. ఈ టోర్నీకి ముందు హీల్‌బ్రోన్‌ ఛాలెంజర్‌ టైటిల్‌ గెలిచాడు. ఈ ఏడాది పారిస్‌ ఒలింపిక్స్‌లో సింగిల్స్‌లో పోటీపడబోతున్న నగాల్‌.. ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 77వ స్థానంలో ఉన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని