ప్రణయ్‌ పరాజయం

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ప్రపంచ టూర్‌ సూపర్‌ 500 టోర్నీలో భారత ఆటగాళ్లు హెచ్‌.ఎస్‌.ప్రణయ్, సమీర్‌వర్మల పోరాటం ముగిసింది.

Published : 15 Jun 2024 02:44 IST

సిడ్నీ: ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ప్రపంచ టూర్‌ సూపర్‌ 500 టోర్నీలో భారత ఆటగాళ్లు హెచ్‌.ఎస్‌.ప్రణయ్, సమీర్‌వర్మల పోరాటం ముగిసింది. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ క్వార్టర్‌ఫైనల్లో ప్రణయ్‌ 19-21, 13-21తో కొడయ్‌ నరవొక (జపాన్‌) చేతిలో, సమీర్‌ 12-21, 13-21తో లిన్‌ చున్‌ (చైనీస్‌ తైపీ) చేతిలో పరాజయం చవిచూశారు. మహిళల సింగిల్స్‌ క్వార్టర్స్‌లో ఆకర్షి కశ్యప్‌ 17-21, 12-21తో పై యు పొ (చైనీస్‌ తైపీ) చేతిలో ఓడింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌ క్వార్టర్స్‌లో సుమీత్‌రెడ్డి- సిక్కిరెడ్డి జోడీ 12-21, 14-21తో జియాంగ్‌ జెన్‌- వీ షిన్‌ (చైనా) జంట చేతిలో పరాజయం చవిచూసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని