గంభీర్‌ సమర్థుడే కానీ..

టీమ్‌ఇండియా కోచ్‌ పదవి రేసులో గౌతమ్‌ గంభీర్‌ ముందున్నాడు. మెంటార్‌గా ఇటీవల కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఐపీఎల్‌ టైటిల్‌ గెలవడంలో గంభీర్‌ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.

Published : 16 Jun 2024 03:09 IST

దిల్లీ: టీమ్‌ఇండియా కోచ్‌ పదవి రేసులో గౌతమ్‌ గంభీర్‌ ముందున్నాడు. మెంటార్‌గా ఇటీవల కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఐపీఎల్‌ టైటిల్‌ గెలవడంలో గంభీర్‌ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. భారత జట్టు కోచ్‌ పదవికి అతడి పేరు ప్రముఖంగా వినపడడానికి ఇది కూడా ఓ ముఖ్య కారణమే. కానీ ఓ జాతీయ జట్టుకు కోచింగ్‌ ఇవ్వడం.. ఓ ఫ్రాంఛైజీకి కోచింగ్‌ ఇవ్వడానికి భిన్నంగా ఉంటుందని భారత క్రికెట్‌ దిగ్గజం అనిల్‌ కుంబ్లే అన్నాడు. ‘‘గంభీర్‌ సమర్థుడే. అతడు జట్లకు మార్గనిర్దేశం చేశాడు. ఐపీఎల్‌లో అతడు కెప్టెన్‌గానూ జట్టును నడిపించాడు. కోచ్‌ కావడానికి అన్ని అర్హతలూ అతడికి ఉన్నాయి. కానీ భారత జట్టుకు కోచింగ్‌ ఇవ్వడమనేది కాస్త భిన్నమైంది. నిలదొక్కుకోవడానికి అతడికి సమయం ఇవ్వాలి. ఒకవేళ గంభీర్‌ను కోచ్‌గా నియమిస్తే.. అతడు ప్రస్తుత భారత ఆటగాళ్లనే కాదు, భారత క్రికెట్‌ భవిష్యత్తునూ చూసుకోవాలి’’ అని కుంబ్లే అన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని