ఏ జట్టునైనా ఓడించగలం

పూర్తి స్థాయిలో ఆడితే ఏ జట్టునైనా ఓడించగలమని అమెరికా వైస్‌ కెప్టెన్‌ అరోన్‌ జోన్స్‌ అన్నాడు. ‘‘సూపర్‌-8 సవాల్‌కు సిద్ధంగా ఉన్నాం. రెండో రౌండ్‌ చేరడం మాకో పెద్ద ఘనత.

Published : 16 Jun 2024 03:11 IST

లాడర్‌హిల్‌: పూర్తి స్థాయిలో ఆడితే ఏ జట్టునైనా ఓడించగలమని అమెరికా వైస్‌ కెప్టెన్‌ అరోన్‌ జోన్స్‌ అన్నాడు. ‘‘సూపర్‌-8 సవాల్‌కు సిద్ధంగా ఉన్నాం. రెండో రౌండ్‌ చేరడం మాకో పెద్ద ఘనత. గత రెండు వారాలుగా అమెరికా మెరుగైన ప్రదర్శన చేసింది. అయితే బలమైన జట్లతో తలపడినా గెలిచే సత్తా అమెరికాకు ఉంది. ఇంతకుముందు అమెరికా క్రికెట్‌పై ప్రపంచం దృష్టి పెట్టలేదు. మా ఆటగాళ్ల ప్రతిభ ఎవరికీ తెలియదు. కానీ ఈ టోర్నీతో మేమేంటో చాటాం’’ జోన్స్‌ చెప్పాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని