గ్యారీ.. సమయం వృథా చేసుకోకు

పాకిస్థాన్‌లో ఉండి సమయం వృథా చేసుకోవద్దని ఆ దేశ క్రికెట్‌ జట్టు కోచ్‌ గారీ కిర్‌స్టన్‌కు భారత మాజీ ఆఫ్‌స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ సూచించాడు.

Published : 18 Jun 2024 02:48 IST

దిల్లీ: పాకిస్థాన్‌లో ఉండి సమయం వృథా చేసుకోవద్దని ఆ దేశ క్రికెట్‌ జట్టు కోచ్‌ గారీ కిర్‌స్టన్‌కు భారత మాజీ ఆఫ్‌స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ సూచించాడు. పాక్‌ జట్టులో ఐక్యత లేదని కిర్‌స్టన్‌ వ్యాఖ్యానించిన నేపథ్యంలో భజ్జీ ఇలా స్పందించాడు. ‘‘నీ సమయం వృథా చేసుకోకు గ్యారీ. టీమ్‌ఇండియాకు కోచింగ్‌ ఇవ్వడానికి తిరిగి వచ్చెయ్‌. కిర్‌స్టన్‌ ఓ గొప్ప కోచ్, మెంటార్‌. 2011లో ప్రపంచకప్‌ గెలిచిన మా జట్టు సభ్యులందరికీ మంచి మిత్రుడు. అప్పటి మా జట్టుకు అతడు కోచ్‌’’ అని అన్నాడు. టీ20 ప్రపంచకప్‌ సందర్భంగా పాక్‌ ఆటగాళ్లు ఒకరికొకరు సహకరించుకోలేదని, ఓ జట్టులో ఇలాంటి వాతావరణాన్ని తానెప్పుడూ చూడలేదని కిర్‌స్టన్‌ వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని