పాక్‌ జట్టులో ఐక్యత లేదు

టీ20 ప్రపంచకప్‌లో ఘోరంగా విఫలమైన పాకిస్థాన్‌పై ఆ జట్టు చీఫ్‌ కోచ్‌ గ్యారీ కిర్‌స్టన్‌ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించాడు. జట్టులో ఐక్యత లేనే లేదని తెలిపాడు.

Published : 18 Jun 2024 02:49 IST

దిల్లీ: టీ20 ప్రపంచకప్‌లో ఘోరంగా విఫలమైన పాకిస్థాన్‌పై ఆ జట్టు చీఫ్‌ కోచ్‌ గ్యారీ కిర్‌స్టన్‌ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించాడు. జట్టులో ఐక్యత లేనే లేదని తెలిపాడు. తన సుదీర్ఘ శిక్షణ కెరీర్‌లో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదని కిర్‌స్టన్‌ చెప్పినట్లు పాక్‌ మీడియాలో కథనాలు వచ్చాయి. ‘‘పాక్‌ జట్టులో ఐక్యత లేదు. వాళ్లు జట్టు అని పిలుస్తారు. కానీ అది జట్టే కాదు. ఒకరికొకరు మద్దతుగా నిలవరు. అందరూ విడిపోయారు. గతంలో చాలా జట్లతో పనిచేశా. కానీ ఇలాంటి పరిస్థితి నేనెప్పుడూ చూడలేదు. భారత్‌ చేతిలో ఓటమి తీవ్ర నిరాశకు గురిచేసింది. 120 పరుగుల లక్ష్యం సులువు కాదని నాకు తెలుసు. భారత్‌ 120 పరుగుల వద్దే ఆగిపోయిందంటే లక్ష్య ఛేదన కష్టమే. అయితే 72/2తో ఉన్నప్పుడు మ్యాచ్‌ మా చేతుల్లోనే ఉంది. అలాంటి స్థితి నుంచి మ్యాచ్‌ను కోల్పోవడం నిరాశ కలిగించింది’’ అని కిర్‌స్టన్‌ పేర్కొన్నట్లు కథనం వచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు