నీరజ్‌ పసిడి త్రో

పారిస్‌ ఒలింపిక్స్‌ ముంగిట భారత జావెలిన్‌త్రో స్టార్‌ నీరజ్‌ చోప్రా ఫామ్‌ ప్రదర్శిస్తున్నాడు. ఫిన్లాండ్‌లో జరిగిన పావో నూర్మి క్రీడల్లో అతడు పసిడి పతకంతో మెరిశాడు. మంగళవారం జావెలిన్‌ను ఉత్తమంగా 85.97 మీటర్లు విసిరి అగ్రస్థానంలో నిలిచాడు.

Published : 19 Jun 2024 04:09 IST

టర్కూ: పారిస్‌ ఒలింపిక్స్‌ ముంగిట భారత జావెలిన్‌త్రో స్టార్‌ నీరజ్‌ చోప్రా ఫామ్‌ ప్రదర్శిస్తున్నాడు. ఫిన్లాండ్‌లో జరిగిన పావో నూర్మి క్రీడల్లో అతడు పసిడి పతకంతో మెరిశాడు. మంగళవారం జావెలిన్‌ను ఉత్తమంగా 85.97 మీటర్లు విసిరి అగ్రస్థానంలో నిలిచాడు. తొలి రెండు ప్రయత్నాల్లో 83.62 మీ, 83.45 మీటర్లు విసిరిన నీరజ్‌.. ఆరంభంలో వెనుకబడ్డాడు. అయితే మూడో త్రోలో 85.97 మీటర్లతో అగ్రస్థానానికి దూసుకొచ్చాడు. ఆపై అంతకుమించిన ప్రదర్శన చేయకపోయినా (82.21 మీ, ఫౌల్, 82.97 మీ) పసిడి పతకాన్ని ఎగరేసుకుపోయాడు. ఫిన్లాండ్‌ ఆటగాళ్లు టోని (84.19 మీ), అలివర్‌ (83.96 మీ) రజత, కాంస్యాలు సాధించారు. మాజీ నంబర్‌వన్‌ ఆటగాడు అండర్సన్‌ పీటర్స్‌ (గ్రెనెడా, 82.58 మీ) నాలుగో స్థానంతో సంతృప్తిపడ్డాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని