అర్జున్‌కు టైటిల్‌

తెలంగాణ గ్రాండ్‌మాస్టర్‌ అర్జున్‌ ఇరిగేశి అంతర్జాతీయ స్థాయిలో మరోసారి సత్తా చాటాడు. ఆర్మేనియాలో జరుగుతున్న స్టీపాన్‌ ఎవాగ్‌యాన్‌ స్మారక చెస్‌ టోర్నీలో అతడు టైటిల్‌ గెలుచుకున్నాడు.

Published : 19 Jun 2024 04:15 IST

దిల్లీ: తెలంగాణ గ్రాండ్‌మాస్టర్‌ అర్జున్‌ ఇరిగేశి అంతర్జాతీయ స్థాయిలో మరోసారి సత్తా చాటాడు. ఆర్మేనియాలో జరుగుతున్న స్టీపాన్‌ ఎవాగ్‌యాన్‌ స్మారక చెస్‌ టోర్నీలో అతడు టైటిల్‌ గెలుచుకున్నాడు. మంగళవారం చివరిదైన తొమ్మిదో రౌండ్లో మాన్యుల్‌ పొట్రోసిన్‌ (ఆర్మేనియా)తో అర్జున్‌ డ్రా చేసుకున్నాడు. దీంతో మొత్తం 6.5 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. ఈ టోర్నీలో అజేయంగా నిలిచిన అతడి ఖాతాలో 4 విజయాలు, 5 డ్రాలు ఉన్నాయి. తాజా గెలుపుతో లైవ్‌ రేటింగ్‌కు మరో 9 పాయింట్లు కలవడంతో ప్రస్తుతం 2779.9తో అర్జున్‌.. కెరీర్‌లో ఉత్తమంగా నాలుగో ర్యాంకుకు చేరుకున్నాడు. కార్ల్‌సన్‌ (2831.8, నార్వే), నకముర (2801.6, అమెరికా), ఫాబియానో కరువానా (2795.6, అమెరికా) అతడికన్నా ముందున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని