కెప్టెన్సీకి విలియమ్సన్‌ దూరం

టీ20 ప్రపంచకప్‌ నుంచి గ్రూపు దశలోనే నిష్క్రమించిన న్యూజిలాండ్‌ జట్టుకు మరో గట్టి దెబ్బ తగలింది. వన్డే, టీ20 సారథ్యం నుంచి కేన్‌ విలియమ్సన్‌ తప్పుకొన్నాడు.

Published : 20 Jun 2024 02:25 IST

క్రైస్ట్‌చర్చ్‌: టీ20 ప్రపంచకప్‌ నుంచి గ్రూపు దశలోనే నిష్క్రమించిన న్యూజిలాండ్‌ జట్టుకు మరో గట్టి దెబ్బ తగలింది. వన్డే, టీ20 సారథ్యం నుంచి కేన్‌ విలియమ్సన్‌ తప్పుకొన్నాడు. అంతర్జాతీయ కెరీర్‌ను పొడిగించుకోవడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. 2024-25 సీజన్‌ న్యూజిలాండ్‌ బోర్డు కాంట్రాక్టునూ విలియమ్సన్‌ వదులుకున్నాడు. ‘‘మూడు ఫార్మాట్లలో జట్టు ముందుకెళ్లడానికి సహాయం అందించడం నాకెంతో ఇష్టం. ఆ విషయంలో ఎలాంటి మార్పు ఉండదు. అయితే వేసవిలో విదేశాల్లో అవకాశాలు పొందడం కోసం కేంద్ర కాంట్రాక్టు ప్రతిపాదనను అంగీకరించలేను. కివీస్‌కు ఆడటం నాకు విలువైన విషయం. జట్టుకు ఏమైనా చేయాలన్న తపన ఏమాత్రం తగ్గలేదు’’ అని విలియమ్సన్‌ వివరించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని