అన్నీ డ్రాలే..

యూరో 2024లో గురువారం స్విట్జర్లాండ్, స్కాట్లాండ్‌ మధ్య గ్రూప్‌-ఎ మ్యాచ్‌ 1-1తో డ్రాగా ముగిసింది.

Published : 21 Jun 2024 03:13 IST

కొలోన్‌: యూరో 2024లో గురువారం స్విట్జర్లాండ్, స్కాట్లాండ్‌ మధ్య గ్రూప్‌-ఎ మ్యాచ్‌ 1-1తో డ్రాగా ముగిసింది. స్విస్‌ జట్టు తరఫున షకిరి (26వ), స్కాట్లాండ్‌ జట్టులో మెక్‌తొమినయ్‌ (13వ) స్కోర్‌ చేశారు. స్లొవేనియా, సెర్బియా మధ్య (గ్రూప్‌-సి) మ్యాచ్‌ కూడా 1-1తో డ్రాగా ముగిసింది. 69వ నిమిషంలో కార్నిస్నిక్‌ గోల్‌తో స్లొవేనియా ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ జట్టుదే విజయమని భావించారంతా. కానీ స్టాపేజ్‌ సమయంలో, చివరి సెకన్లలో జోవిచ్‌ (90+5) కొట్టిన గోల్‌తో స్కోరు సమం చేసిన సెర్బియా సంబరాల్లో మునిగిపోయింది. డెన్మార్క్, ఇంగ్లాండ్‌ మధ్య మ్యాచ్‌ (గ్రూప్‌-సి)లోనూ ఫలితం తేలలేదు. పోరు 1-1తో సమమైంది. ఇంగ్లాండ్‌ జట్టులో కేన్‌ (18వ), డెన్మార్క్‌ జట్టులో హ్యూల్మండ్‌ (34వ) స్కోర్‌ చేశారు.

సందడి పెంచే కోపా: ఓ వైపు యూరో కప్‌ సందడి కొనసాగుతుండగానే ఫుట్‌బాల్‌ అభిమానులకు మరింత కిక్‌ ఇచ్చేందుకు కోపా అమెరికా టోర్నీ కూడా సిద్ధమైంది. శతాబ్దానికి పైగా చరిత్ర కలిగిన ఈ పురాతన ఫుట్‌బాల్‌ టోర్నీ 48వ సీజన్‌కు శుక్రవారమే తెరలేవనుంది. భారత కాలమానం ప్రకారం ఉదయం 5.30 గంటలకు డిఫెండింగ్‌ ఛాంపియన్‌ అర్జెంటీనా, కెనడా మధ్య తొలి మ్యాచ్‌ ఆరంభమవుతుంది. అమెరికాలోని 14 నగరాల్లో జరిగే ఈ టోర్నీలో 16 జట్లు టైటిల్‌ కోసం తలపడుతున్నాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని