ఉప్పల్‌లో బంగ్లాతో టీ20

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భాగంగా సొంతగడ్డపై భారత జట్టు అయిదు మ్యాచ్‌లు ఆడనుంది. బంగ్లాదేశ్‌తో రెండు, న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లలో భారత్‌ తలపడనుంది.

Published : 21 Jun 2024 03:16 IST

స్వదేశంలో భారత జట్టు షెడ్యూల్‌ విడుదల

దిల్లీ: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భాగంగా సొంతగడ్డపై భారత జట్టు అయిదు మ్యాచ్‌లు ఆడనుంది. బంగ్లాదేశ్‌తో రెండు, న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లలో భారత్‌ తలపడనుంది. ఈ ఏడాది సెప్టెంబరు 19 నుంచి 2025 ఫిబ్రవరి 12 వరకు స్వదేశంలో జరిగే టీ20, వన్డే, టెస్టు సిరీస్‌ల షెడ్యూల్‌ను బీసీసీఐ గురువారం విడుదల చేసింది. బంగ్లాదేశ్‌ పర్యటనతో భారత్‌ స్వదేశీ అంతర్జాతీయ సీజన్‌ ప్రారంభమవుతుంది. బంగ్లాతో రెండు టెస్టులకు చెన్నై (సెప్టెంబరు 19-23), కాన్పూర్‌ (సెప్టెంబరు 27- అక్టోబరు 1) ఆతిథ్యమిస్తుండగా.. ధర్మశాల (అక్టోబరు 6), దిల్లీ (అక్టోబరు 9), హైదరాబాద్‌ (అక్టోబరు 12)లో వరుసగా మూడు టీ20 మ్యాచ్‌లు జరుగుతాయి. కివీస్‌తో మూడు టెస్టులకు బెంగళూరు (అక్టోబరు 16-20), పుణె (అక్టోబరు 24-28), ముంబయి (నవంబరు 1-5) వేదికగా నిలుస్తాయి. ఇంగ్లాండ్‌తో అయిదు టీ20లు, మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లలో భారత్‌ పోటీపడనుంది. అయిదు టీ20లకు వరుసగా చెన్నై (జనవరి 22), కోల్‌కతా (జనవరి 25), రాజ్‌కోట్‌ (జనవరి 28), పుణె (జనవరి 31), ముంబయి (ఫిబ్రవరి 2) ఆతిథ్యమివ్వనున్నాయి. నాగ్‌పుర్‌ (ఫిబ్రవరి 6), కటక్‌ (ఫిబ్రవరి 9), అహ్మదా బాద్‌ (ఫిబ్రవరి 12)లో వరుసగా మూడు వన్డేలు జరుగుతాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని