క్లీన్‌స్వీప్‌పై భారత్‌ గురి

అదిరే ఫామ్‌లో ఉన్న భారత మహిళల క్రికెట్‌ జట్టు.. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌లో క్లీన్‌స్వీప్‌పై గురి పెట్టింది. ఇప్పటికే మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో ఉన్న హర్మన్‌ప్రీత్‌ బృందం.. ఆదివారం చివరి వన్డేలోనూ గెలవాలనే పట్టుదలతో ఉంది.

Published : 23 Jun 2024 01:37 IST

దక్షిణాఫ్రికాతో మూడో వన్డే నేడే
మధ్యాహ్నం 1.30 నుంచి

బెంగళూరు: అదిరే ఫామ్‌లో ఉన్న భారత మహిళల క్రికెట్‌ జట్టు.. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌లో క్లీన్‌స్వీప్‌పై గురి పెట్టింది. ఇప్పటికే మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో ఉన్న హర్మన్‌ప్రీత్‌ బృందం.. ఆదివారం చివరి వన్డేలోనూ గెలవాలనే పట్టుదలతో ఉంది. తొలి రెండు వన్డేల్లో వైస్‌ కెప్టెన్‌ స్మృతి మంధాన సెంచరీలతో మెరవడంతో టీమ్‌ఇండియా సఫారీ జట్టుపై పైచేయి సాధించింది. రెండో వన్డేలో కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ సెంచరీతో ఫామ్‌లోకి రావడం శుభసూచకం. 


నోరిస్‌కు పోల్‌ 

మాంట్‌మెలో (స్పెయిన్‌): స్పానిష్‌ గ్రాండ్‌ప్రి ఫార్ములావన్‌ రేసులో లాండో నోరిస్‌కు పోల్‌ పొజిషన్‌ దక్కింది. శనివారం క్వాలిఫయింగ్‌లో 1 నిమిషం 11.383 సెకన్లలో ల్యాప్‌ పూర్తి చేసి నోరిస్‌ అగ్రస్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో ఈ సీజన్లో టాప్‌ ఫామ్‌లో ఉన్న రెడ్‌బుల్‌ స్టార్‌ మ్యాక్స్‌ వెర్‌స్టాపెన్‌  (1 నిమిషం 11.403 సె)ను వెనక్కి నెట్టాడు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని