ఒలింపిక్స్‌లో భలే మార్పు

విశ్వ క్రీడా సంబరం ఒలింపిక్స్‌లో అథ్లెటిక్స్‌ ఎప్పుడూ రెండో వారంలో మొదలవుతుంటాయి. అప్పటిదాకా ఒలింపిక్స్‌ ఆరంభమైనట్లే అనిపించదు. అయితే త్వరలో కథ మారబోతోంది.

Published : 23 Jun 2024 01:38 IST

2028లో తొలి వారంలోనే అథ్లెటిక్స్‌

లాస్‌ ఏంజెలెస్‌: విశ్వ క్రీడా సంబరం ఒలింపిక్స్‌లో అథ్లెటిక్స్‌ ఎప్పుడూ రెండో వారంలో మొదలవుతుంటాయి. అప్పటిదాకా ఒలింపిక్స్‌ ఆరంభమైనట్లే అనిపించదు. అయితే త్వరలో కథ మారబోతోంది. 2028 లాస్‌ ఏంజెలెస్‌ ఒలింపిక్స్‌లో తొలి వారంలోనే అథ్లెటిక్స్‌ పోటీలు  మొదలైపోనున్నాయి. ఈ మేరకు అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ, లాస్‌ ఏంజెలెస్‌ ఒలింపిక్స్‌ నిర్వాహక కమిటీ, ప్రపంచ అథ్లెటిక్స్‌ సమాఖ్య ఉమ్మడిగా ప్రకటన చేశాయి. మూడోసారి ఒలింపిక్స్‌కు ఆతిథ్యమివ్వనున్న స్టేడియంగా చరిత్రకెక్కనున్న ఎల్‌ఏ మెమోరియల్‌ కొలీజియంలో అథ్లెటిక్స్‌ పోటీలు జరగనున్నాయి. ఈ స్టేడియం మాస్టర్‌ ప్లాన్‌కు అనుగుణంగా.. ఒలింపిక్స్‌ వీక్షకులకు కొత్త అనుభూతిని పంచే ఉద్దేశంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని