పారిస్‌కు నగాల్‌

భారత టెన్నిస్‌ స్టార్‌ సుమిత్‌ నగాల్‌ పారిస్‌ ఒలింపిక్స్‌లో సింగిల్స్‌ బరిలో దిగబోతున్నాడు. శనివారం ఈ విషయాన్ని అతడు అధికారికంగా వెల్లడించాడు. ‘‘2024 పారిస్‌ ఒలింపిక్స్‌లో సింగిల్స్‌ ఆడేందుకు అధికారికంగా అర్హత సాధించా.

Published : 23 Jun 2024 01:39 IST

చెన్నై: భారత టెన్నిస్‌ స్టార్‌ సుమిత్‌ నగాల్‌ పారిస్‌ ఒలింపిక్స్‌లో సింగిల్స్‌ బరిలో దిగబోతున్నాడు. శనివారం ఈ విషయాన్ని అతడు అధికారికంగా వెల్లడించాడు. ‘‘2024 పారిస్‌ ఒలింపిక్స్‌లో సింగిల్స్‌ ఆడేందుకు అధికారికంగా అర్హత సాధించా. ఒలింపిక్స్‌కు నా మనసులో ప్రత్యేక స్థానం ఉంది. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో ఆడటం గొప్ప అనుభూతినిచ్చింది. పారిస్‌లో మెరుగ్గా రాణిస్తాననే ఆశతో ఉన్నా’’ అని నగాల్‌ ఎక్స్‌ వేదికగా వెల్లడించాడు. టోక్యో ఒలింపిక్స్‌లో నగాల్‌ రెండో రౌండ్లో వెనుదిరిగాడు. ప్రస్తుతం ఫామ్‌లో ఉన్న ఈ భారత కుర్రాడు.. ఈ నెల ఆరంభంలో హెయిల్‌బ్రోన్‌ ఛాలెంజËర్‌ టోర్నీని గెలిచి ఒలింపిక్స్‌ ముంగిట సత్తా చాటాడు. ర్యాంకింగ్స్‌లో 71వ స్థానానికి చేరుకున్నాడు. పారిస్‌ ఒలింపిక్స్‌లో పురుషుల డబుల్స్‌లో రోహన్‌ బోపన్న-శ్రీరామ్‌ బాలాజీ పోటీ పడనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని