పోర్చుగల్‌ ఘనవిజయం

యూరో కప్‌ ఫుట్‌బాల్‌ టోర్నీలో పోర్చుగల్‌ అదరగొట్టింది. శనివారం జరిగిన గ్రూప్‌-ఎఫ్‌ మ్యాచ్‌లో 3-0తో తుర్కియేపై ఘనవిజయం సాధించింది. ఫ్రాన్స్‌ తరఫున బెర్నార్డో సిల్వా (21వ), బ్రూనో ఫెర్నాండెజ్‌ (56వ) స్కోర్‌ చేశారు.

Published : 23 Jun 2024 01:41 IST

డార్ట్‌మండ్‌: యూరో కప్‌ ఫుట్‌బాల్‌ టోర్నీలో పోర్చుగల్‌ అదరగొట్టింది. శనివారం జరిగిన గ్రూప్‌-ఎఫ్‌ మ్యాచ్‌లో 3-0తో తుర్కియేపై ఘనవిజయం సాధించింది. ఫ్రాన్స్‌ తరఫున బెర్నార్డో సిల్వా (21వ), బ్రూనో ఫెర్నాండెజ్‌ (56వ) స్కోర్‌ చేశారు. తుర్కియే ఆటగాడు అకాయ్‌దిన్‌ 28వ నిమిషంలో సెల్ఫ్‌ గోల్‌ కొట్టాడు. మరోవైపు ఫ్రాన్స్, నెదర్లాండ్స్‌ మధ్య గ్రూప్‌-బి మ్యాచ్‌ 0-0తో ఫలితం తేలకుండా ముగిసింది. రెండు జట్ల తరపున ఏ ఆటగాడూ గోల్‌ చేయలేకపోయాడు. ఫ్రాన్స్‌ అటాకింగ్‌ను నెదర్లాండ్స్‌ గొప్పగా అడ్డుకోగలిగింది. ఇక జార్జియా, చెక్‌ రిపబ్లిక్‌ మధ్య మ్యాచ్‌ (గ్రూప్‌-ఎఫ్‌) 1-1తో డ్రాగా ముగిసింది. జార్జియా తరఫున మికౌతాజె (45వ), చెక్‌ తరఫున చిక్‌ (59వ) స్కోర్‌ చేశారు. 

కోపాలో డ్రా: కోపా అమెరికా ఫుట్‌బాల్‌ టోర్నీలోను శనివారం చిలీ, పెరూ మధ్య జరిగిన గ్రూప్‌-ఎ మ్యాచ్‌ 0-0తో డ్రాగా ముగిసింది. చిలీ గోల్‌కీపర్‌ క్లాడియో బ్రావో నాలుగు సార్లు ప్రత్యర్థి గోల్‌ ప్రయత్నాలను అడ్డుకుని జట్టును ఆదుకున్నాడు. అతను ఈ టోర్నీ చరిత్రలోనే అత్యంత పెద్ద వయస్సు (41 ఏళ్ల 69 రోజులు) ఆటగాడిగా నిలిచాడు.  

యూరోకప్‌లో ఈనాడు  బెల్జియం × రొమేనియా (రాత్రి 12.30)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని