షకిబ్‌.. కుర్రాళ్లకు ఛాన్సివ్వాల్సిందే: సెహ్వాగ్‌

‘సెహ్వాగ్‌ ఎవరు’ అంటూ వ్యంగ్యంగా స్పదించిన బంగ్లాదేశ్‌ స్టార్‌ షకిబ్‌ అల్‌ హసన్‌కు వీరూ తన వ్యాఖ్యలతో చురకలంటించాడు. భారత్‌తో మ్యాచ్‌లో షకిబ్‌ దారుణంగా విఫలమయ్యాడని..

Published : 24 Jun 2024 03:28 IST

దిల్లీ: ‘సెహ్వాగ్‌ ఎవరు’ అంటూ వ్యంగ్యంగా స్పదించిన బంగ్లాదేశ్‌ స్టార్‌ షకిబ్‌ అల్‌ హసన్‌కు వీరూ తన వ్యాఖ్యలతో చురకలంటించాడు. భారత్‌తో మ్యాచ్‌లో షకిబ్‌ దారుణంగా విఫలమయ్యాడని.. అనుభవజ్ఞుడు అయి ఉండే కీలక సమయంలో రాణించలేకపోయాడని అన్నాడు. ‘‘క్రీజులో కుదురుకున్న బ్యాటర్‌ ఉన్నప్పుడు అతడికి మద్దతు ఇవ్వాలి. వీలైనంతసేపు క్రీజులో నిలవాలి. 11 బంతులు ఆడి ఏడు పరుగులే చేసి ఔటైతే ఏం లాభం? షకిబ్‌కు చాలా అనుభవం ఉంది. భారత్‌పై పరిస్థితికి తగ్గట్టుగా అతడు ఎందుకు ఆడలేకపోయాడు? లక్ష్యం భారీగా ఉంది.. ప్రతి బంతికి సిక్స్‌ మాత్రమే కొట్టాలని అనుకున్నాడా? అందుకే ఇంతకుముందు కూడా చెప్పాను.. అతడు జట్టు నుంచి వైదొలిగి కుర్రాళ్లకు అవకాశం ఇవ్వడం మంచిది’’ అని సెహ్వాగ్‌ పునరుద్ఘాటించాడు. భారత్‌తో మ్యాచ్‌లో 196 పరుగుల ఛేదనలో అయిదో స్థానంలో వచ్చిన షకిబ్‌ కీలక సమయంలో కుల్‌దీప్‌ బౌలింగ్‌లో ఔట్‌ అయ్యాడు. ఇది బంగ్లాను దెబ్బ తీసింది. అంతకుముందు షకిబ్‌ వరుసగా విఫలమవుతుండడంతో ఇక అతను రిటైరైతే మంచిదనే అభిప్రాయాన్ని సెహ్వాగ్‌ వ్యక్తం చేశాడు. ఈ వ్యాఖ్యలను ఓ విలేకరి ప్రశ్నించగా.. ‘‘సెహ్వాగ్‌ ఎవరు’’ అని ఎదురు ప్రశ్నించాడు షకిబ్‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని