చరిత్ర సృష్టించిన శ్రీజ

భారత టేబుల్‌ టెన్నిస్‌ సంచలనం ఆకుల శ్రీజ చరిత్ర సృష్టించింది. డబ్ల్యూటీటీ కంటెండర్‌ సింగిల్స్‌ టైటిల్‌ గెలిచిన మొట్టమొదటి భారత టీటీ ప్లేయర్‌గా రికార్డు నమోదు చేసింది.

Published : 24 Jun 2024 03:30 IST

డబ్ల్యూటీటీ కంటెండర్‌ టైటిల్‌ సొంతం

లాగోస్‌: భారత టేబుల్‌ టెన్నిస్‌ సంచలనం ఆకుల శ్రీజ చరిత్ర సృష్టించింది. డబ్ల్యూటీటీ కంటెండర్‌ సింగిల్స్‌ టైటిల్‌ గెలిచిన మొట్టమొదటి భారత టీటీ ప్లేయర్‌గా రికార్డు నమోదు చేసింది. నైజీరియాలో జరిగిన టోర్నీలో మహిళల డబుల్స్‌లోనూ పసిడి నెగ్గిన ఈ హైదరాబాద్‌ అమ్మాయి.. ఒకే టోర్నీలో రెండు స్వర్ణాలు గెలిచిన తొలి భారత ప్లేయర్‌గానూ ఘనత సాధించింది. ఆదివారం మహిళల సింగిల్స్‌ తుదిపోరులో భారత రెండో ర్యాంకర్‌ శ్రీజ 4-1 (10-12, 11-9, 11-6, 11-8, 11-6) తేడాతో డింగ్‌ యిజీ (చైనా)ని చిత్తుచేసింది. డబుల్స్‌ తుదిపోరులో శ్రీజ- అర్చన జోడీ 3-0 (11-9, 11-6, 12-10)తో సహచర దియా- యశస్విని జంటపై గెలిచింది. మరోవైపు 3-0 (11-8, 11-9, 11-8)తో అజీజ్‌- ఓమోటాయో (నైజీరియా)పై గెలిచిన హర్మీత్‌- మానవ్‌.. డబ్ల్యూటీటీ కంటెండర్‌ టోర్నీలో పురుషుల డబుల్స్‌ టైటిల్‌ నెగ్గిన   తొలి భారత జోడీగా నిలిచారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు