సుహాస్‌.. ప్రపంచ నంబర్‌వన్‌

భారత పారా షట్లర్‌ సుహాస్‌ యతిరాజ్‌ ప్రపంచ నంబర్‌వన్‌ అయ్యాడు. బీడబ్ల్యూఎఫ్‌ పారా బ్యాడ్మింటన్‌ పురుషుల సింగిల్స్‌ ర్యాంకింగ్స్‌లో అతను ఫ్రెంచ్‌ దిగ్గజం లూకాస్‌ మజుర్‌ను వెనక్కి నెట్టి అగ్రస్థానం సంపాదించాడు.

Published : 26 Jun 2024 02:56 IST

దిల్లీ: భారత పారా షట్లర్‌ సుహాస్‌ యతిరాజ్‌ ప్రపంచ నంబర్‌వన్‌ అయ్యాడు. బీడబ్ల్యూఎఫ్‌ పారా బ్యాడ్మింటన్‌ పురుషుల సింగిల్స్‌ ర్యాంకింగ్స్‌లో అతను ఫ్రెంచ్‌ దిగ్గజం లూకాస్‌ మజుర్‌ను వెనక్కి నెట్టి అగ్రస్థానం సంపాదించాడు. అతడి ఖాతాలో 60,527 పాయింట్లున్నాయి. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి అయిన సుహాస్‌.. ఈ ఫిబ్రవరిలో ఎస్‌ఎల్‌-4 విభాగంలో ప్రపంచ ఛాంపియన్‌ అయ్యాడు. అతను టోక్యో ఒలింపిక్స్‌లో రజతం గెలిచాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని