అది తప్పుకోవడం కాదు

పారిస్‌ డైమండ్‌ లీగ్‌ నుంచి తాను తప్పుకున్నట్లు వస్తున్న వార్తలపై భారత స్టార్‌ జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా స్పష్టత ఇచ్చాడు.

Published : 04 Jul 2024 03:17 IST

సార్‌బ్రకెన్‌ (జర్మనీ): పారిస్‌ డైమండ్‌ లీగ్‌ నుంచి తాను తప్పుకున్నట్లు వస్తున్న వార్తలపై భారత స్టార్‌ జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా స్పష్టత ఇచ్చాడు. ఈ ఏడాది తన పోటీల ప్రణాళికలోనే ఆ ఈవెంట్‌ లేదని అతను తెలిపాడు.  ‘‘అందరికీ ఒక విషయంపై స్పష్టతనివ్వాలి. నా పోటీల ప్రణాళికలో పారిస్‌ డైమండ్‌ లీగ్‌ లేదు. అలాంటపుడు నేను దాన్నుంచి తప్పుకోవడం అన్నదే ఉండదు. నేను ఒలింపిక్స్‌కు సన్నద్ధం కావడం మీదే దృష్టిసారించా. నన్ను అర్థం చేసుకున్న వారికి కృతజ్ఞతలు. ఆ పోటీలో పాల్గొంటున్న క్రీడాకారులకు శుభాకాంక్షలు’’ అని ‘ఎక్స్‌’లో నీరజ్‌ పేర్కొన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు