స్పెయిన్‌తో జర్మనీ ఢీ

యూరో కప్‌లో కీలక సమరం! శుక్రవారం క్వార్టర్‌ఫైనల్లో స్టార్‌ జట్లు స్పెయిన్‌-జర్మనీ అమీతుమీ తేల్చుకోనున్నాయి.

Updated : 05 Jul 2024 04:06 IST

రాత్రి 9.30 నుంచి

హాంబర్గ్‌: యూరో కప్‌లో కీలక సమరం! శుక్రవారం క్వార్టర్‌ఫైనల్లో స్టార్‌ జట్లు స్పెయిన్‌-జర్మనీ అమీతుమీ తేల్చుకోనున్నాయి. గత 36 ఏళ్లుగా స్పెయిన్‌పై ఏ టోర్నీలో విజయం సాధించలేకపోయిన జర్మనీ ఈసారి ఎలాగైనా నెగ్గాలనే పట్టుదలతో ఉంది. 2014 తర్వాత ఒక పెద్ద టోర్నీ గెలవలేకపోయిన జర్మనీకి స్పెయిన్‌ రూపంలో పెద్ద అడ్డంకి ఎదురైంది. మరి ఈసారి జర్మనీ ఎలా ఆడుతుందన్నది ఆసక్తికరం. ఈ టోర్నీలో 3 గోల్స్‌తో టాప్‌స్కోరర్‌గా ఉన్న ముసియాలాపై జర్మనీ ఆశలు పెట్టుకోగా.. యువ ఆటగాళ్లు లమైన్‌ యమాల్, నికో విలియమ్స్‌పై స్పెయిన్‌ ఆధారపడుతోంది. వరుసగా నాలుగు విజయాలతో జోరు మీదున్న స్పెయిన్‌ను ఆపడం ఆ జట్టుకు అంత తేలికేం కాదు. రాత్రి 12.30కు ఆరంభమయ్యే మరో క్వార్టర్స్‌లో పోర్చుగల్‌-ఫ్రాన్స్‌ తలపడబోతున్నాయి. రొనాల్డో (పోర్చుగల్‌), ఎంబాపె (ఫ్రాన్స్‌) పైనే అందరి దృష్టీ ఉంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు