సంక్షిప్త వార్తలు (3)

కెనడా ఓపెన్‌ ప్రపంచ టూర్‌ సూపర్‌ 500 టోర్నీలో భారత్‌ పోరాటం ముగిసింది. భారత వర్ధమాన ఆటగాడు ప్రియాన్షు రజావత్‌కు చుక్కెదురైంది. పురుషుల సింగిల్స్‌ సెమీఫైనల్లో రజావత్‌ 17-21, 10-21తో అలెక్స్‌ లేనియెర్‌ (ఫ్రాన్స్‌) చేతిలో పరాజయం చవిచూశాడు.

Published : 08 Jul 2024 03:00 IST

రజావత్‌ పరాజయం 

కాల్గరీ (కెనడా): కెనడా ఓపెన్‌ ప్రపంచ టూర్‌ సూపర్‌ 500 టోర్నీలో భారత్‌ పోరాటం ముగిసింది. భారత వర్ధమాన ఆటగాడు ప్రియాన్షు రజావత్‌కు చుక్కెదురైంది. పురుషుల సింగిల్స్‌ సెమీఫైనల్లో రజావత్‌ 17-21, 10-21తో అలెక్స్‌ లేనియెర్‌ (ఫ్రాన్స్‌) చేతిలో పరాజయం చవిచూశాడు. క్వార్టర్‌ఫైనల్లో టాప్‌ సీడ్‌ ఆండర్స్‌ ఆంథోన్సెన్‌కు షాకిచ్చి టైటిల్‌పై ఆశలు రేపిన రజావత్‌కు సెమీస్‌లో నిరాశ ఎదురైంది. 


సాబ్లె 6.. కిశోర్‌ 8 

పారిస్‌: డైమండ్‌ లీగ్‌ మీట్‌లో భారత స్టీపుల్‌ చేజర్‌ అవినాష్‌ సాబ్లె మెరుగైన ప్రదర్శన చేశాడు. అతను 3000 మీ. స్టీపుల్‌ చేజ్‌లో తన పేరిటే ఉన్న జాతీయ రికార్డును మెరుగుపరిచాడు. 8 నిమిషాల 9.91 సెక్లన్లలో రేసును పూర్తి చేసిన సాబ్లె ఆరో స్థానంలో నిలిచాడు. జావెలిన్‌ త్రో పోటీలో కిశోర్‌ జెనా ఎనిమిదో స్థానానికి పరిమితమయ్యాడు. అతను 78.10 మీటర్లు జావెలిన్‌ను విసిరాడు. స్టార్‌ అథ్లెట్‌ నీరజ్‌ చోప్రా ఈ పోటీలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే.


అభయ్‌కి ‘డబుల్‌’ 

జోహోర్‌ (మలేసియా): ఆసియా డబుల్స్‌ స్క్వాష్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత ఆటగాడు అభయ్‌ సింగ్‌ సత్తాచాటాడు. ఈ టోర్నీలో అభయ్‌ రెండు టైటిళ్లు సాధించాడు. పురుషుల డబుల్స్‌ ఫైనల్లో అభయ్‌- వేలవన్‌ సెంథిల్‌కుమార్‌ జోడీ 11-4, 11-5తో ఆంగ్‌ హంగ్‌- సైఫిక్‌ కమాల్‌ (మలేసియా) జంటపై నెగ్గి విజేతగా నిలిచింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌ ఫైనల్లో అభయ్‌- జ్యోష్న చినప్ప జంట 11-8, 10-11, 11-5తో టాంగ్‌ వింగ్‌- టాంగ్‌ హాంగ్‌ (హాంకాంగ్‌) జోడీపై గెలిచి టైటిల్‌ కైవసం చేసుకుంది.


లండన్‌లో వింబుల్డన్‌ సందర్భంగా టెన్నిస్‌ స్టార్‌ రోజర్‌ ఫెదరర్‌తో భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందుల్కర్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని