సెమీస్‌లో నెదర్లాండ్స్‌

నెదర్లాండ్స్‌ జట్టు యూరో 2024 సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. క్వార్టర్‌ఫైనల్లో వెనుకబడ్డా పుంజుకున్న ఆ జట్టు.. 2-1తో తుర్కియేపై విజయం సాధించింది. పోరును నెదర్లాండ్స్‌ మెరుగ్గానే ఆరంభించింది.

Updated : 08 Jul 2024 04:39 IST

యూరో క్వార్టర్స్‌లో తుర్కియేపై విజయం

విజయానందంలో నెదర్లాండ్స్‌ ఆటగాళ్లు

బెర్లిన్‌: నెదర్లాండ్స్‌ జట్టు యూరో 2024 సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. క్వార్టర్‌ఫైనల్లో వెనుకబడ్డా పుంజుకున్న ఆ జట్టు.. 2-1తో తుర్కియేపై విజయం సాధించింది. పోరును నెదర్లాండ్స్‌ మెరుగ్గానే ఆరంభించింది. కానీ ఆ జట్టును తుర్కియే రక్షణశ్రేణి సమర్థంగా నిలువరించింది. తుర్కియే క్రమంగా ప్రత్యర్థి డిఫెన్స్‌ ఒత్తిడి పెంచింది. 35వ నిమిషలో ఫలితం రాబట్టింది. అర్దా గులెర్‌ నుంచి వచ్చిన క్రాస్‌ను డిఫెండర్‌ అకయ్‌దిన్‌ తలతో నెట్లో కొట్టడంతో తుర్కియే ఆధిక్యంలోకి వెళ్లింది. నెదర్లాండ్స్‌ దూకుడుగా ఆడుతున్నా.. ద్వితీయార్ధం ఆరంభంలో తుర్కియే రెండో గోల్‌ కొట్టినంత పని చేసింది. గులెర్‌ ఫ్రీకిక్‌ పోస్ట్‌కు తగిలింది. అయితే తుర్కియేపై ఒత్తిడి పెంచుతూ పోయిన నెదర్లాండ్స్‌ 70వ నిమిషంలో డివ్రిజ్‌ బలమైన హెడర్‌తో స్కోరు సమం చేసింది. కాసేపటికే తుర్కియే ఆటగాడు ముల్దర్‌ సెల్ఫ్‌ గోల్‌ (76వ నిమిషం)తో డచ్‌ జట్టు పైచేయి సాధించింది. 

సెమీస్‌లో..

స్పెయిన్‌ × ఫ్రాన్స్‌
మంగళవారం అర్ధరాత్రి 12.30 నుంచి

నెదర్లాండ్స్‌ × ఇంగ్లాండ్‌1
బుధవారం అర్ధరాత్రి 12.30 నుంచి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని