రూ.125 కోట్లలో ఎవరికెంత?

టీ20 ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన భారత జట్టుకు బీసీసీఐ రూ.125 కోట్ల భారీ నజరానా ప్రకటించడం అందరికీ తెలిసిందే. ఈ మొత్తంలో ఎవరెవరికి ఎంతొస్తుందో అని తెలుసుకోవాలన్న ఆసక్తి చాలామందికి ఉంటుంది.

Published : 09 Jul 2024 02:29 IST

 

దిల్లీ: టీ20 ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన భారత జట్టుకు బీసీసీఐ రూ.125 కోట్ల భారీ నజరానా ప్రకటించడం అందరికీ తెలిసిందే. ఈ మొత్తంలో ఎవరెవరికి ఎంతొస్తుందో అని తెలుసుకోవాలన్న ఆసక్తి చాలామందికి ఉంటుంది. బీసీసీఐ వర్గాల ప్రకారం జట్టులోని 15 మంది ఆటగాళ్లు, సహాయక సిబ్బందికి ఈ మొత్తాన్ని పంచనున్నారు. 15 మంది ఆటగాళ్లతో పాటు ప్రధాన కోచ్‌ ద్రవిడ్‌కు రూ.5 కోట్లు చొప్పున నగదు బహుమతి లభించనుంది. కోచింగ్‌ బృందంలో ద్రవిడ్‌ కాకుండా మిగతా వారికి రూ. 2.5 కోట్ల చొప్పున, సహాయక సిబ్బందికి రూ. 2 కోట్లు, జట్టులోని రిజర్వ్‌ ఆటగాళ్లు, సెలక్షన్‌ కమిటీ సభ్యులకు రూ. కోటి చొప్పున నగదు బహుమతిని పంచనున్నారని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని